News October 23, 2025
తిరుపతి జిల్లాలో వర్షాలు.. ఇవి గుర్తుంచుకోండి

➤ నేటి నుంచి 3రోజులు భారీ వర్షాలు
➤ అత్యవసరమైతే ఇళ్ల నుంచి బయటకు రండి
➤ బీచ్‌లకు వెళ్లడం, చేపలవేట నిషేధం
➤ వర్షాల సమయంలో టీవీలు, ఫ్రిడ్జ్‌లు ఆపేయండి
➤వాగులు, కాలువలు, చెరువుల వద్దకు వెళ్లకండి
➤కలెక్టరేట్ నంబర్: 0877226007
➤పోలీస్ కంట్రోల్ రూమ్: 112, 8099999970
Similar News
News October 23, 2025
NLG: తెల్ల బంగారం.. ఇలా అయ్యిందేంటి?!

పత్తి పంట దిగుబడులు భారీగా పడిపోయాయి. ఎకరాకు కనీసం పది క్వింటాళ్ల వరకు దిగుబడి రావాల్సిన పత్తి.. కనీసం ఐదారు క్వింటాళ్లు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో పత్తి సాగు చేసిన చేలల్లో దిగుబడి మరింత దారుణంగా ఉంటుందన్నారు. ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది 7,93,627 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. పంట చేతికి వచ్చే సమయంలో వర్షాలు కురుస్తుండడంతో దీని ప్రభావం ప్రతి దిగుబడిపై పడిందని చెబుతున్నారు.
News October 23, 2025
చారకొండలో 12.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

గడచిన 24 గంటలలో నాగర్‌కర్నూల్ జిల్లా వ్యాప్తంగా నమోదైన వర్షపాతం వివరాలను వాతావరణ శాఖ అధికారులు గురువారం ప్రకటించారు. జిల్లాలోనే అత్యధికంగా చారకొండ మండలంలో 12.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొల్లాపూర్‌లో 7.3, పెద్దకొత్తపల్లిలో 6.8, నాగర్‌కర్నూల్ 4.8, కల్వకుర్తిలో 4.5, తాడూరులో 3.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు పేర్కొన్నారు.
News October 23, 2025
మండవల్లి: షార్ట్ సర్క్కూట్‌తో ఎలక్ట్రీషయన్ మృతి

మండవల్లి మండలం మండవల్లి గ్రామానికి చెందిన చిగురుపాటి సుకుమార్ (24) ప్రైవేట్ ఎలక్ట్రీషయన్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం పెదపాడు మండలం ఏపూరులో ఎలక్ట్రికల్ లైన్లు మార్చే పనికి వెళ్ళాడు. ఎలక్ట్రికల్ స్తంభం ఎక్కిన కొద్దిసేపటికే అతను విద్యుత్ ఘాతానికి గురై కుప్పకూలాడు. తోటి పనివారు అతన్ని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు.