News December 9, 2025

తిరుపతి జిల్లాలో విషాదం.. ఇద్దరు మృతి

image

తిరుపతి(D) నారాయణవనం మండలంలో విషాద ఘటన జరిగింది. నగరి(ఛ) గుండ్రాజుకుప్పానికి చెందిన గుణశేఖర్(42) తిరువట్యంలో జరిగిన బంధువుల దహనక్రియలకు హాజరయ్యారు. తిరిగి ఇంటికి వెళ్తుండగా తిరువట్యం కాజ్‌వే వద్ద నారాయణవనం రజక కాలనీకి చెందిన అంకమ్మ(72) బట్టలు ఉతుకుతూ నదిలో పడిపోవడాన్ని ఆయన గుర్తించారు. ఆమెను కాపాడడానికి గుణశేఖర్ నదిలోకి దూకారు. ఈత రాకపోవడంతో వృద్ధురాలితో పాటు అతనూ నీట మునిగి చనిపోయారు.

Similar News

News December 11, 2025

జగిత్యాల: 9AM వరకు పోలైన ఓట్లు 36,377

image

జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో గ్రామపంచాయతీ ఎన్నికలు శాంతియుతంగా కొనసాగుతున్నాయి. ఉదయం 9 గంటల వరకు కోరుట్ల మండలంలో 5,544 ఓట్లు పోల్ అయ్యాయి. అలాగే నియోజకవర్గంలోని ఇతర మండలాల్లో.. భీమారం 3,794, ఇబ్రహీంపట్నం 4,832, కథలాపూర్ 5,578, మల్లాపూర్ 5,202, మేడిపల్లి 5,052, మేట్‌పల్లిలో 6,375 ఓట్లు నమోదయ్యాయి. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా 36,377 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

News December 11, 2025

ఓటర్లు ఉత్సాహంగా తరలివస్తున్నారు: ఎస్పీ శబరీష్

image

గూడూరు మండలంలోని 41 గ్రామ పంచాయతీలకు పోలింగ్ కొనసాగుతోంది. జిల్లా ఎస్పీ శబరీష్ మండల కేంద్రంలోని ఓటింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారని తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని ఎస్పీ స్పష్టం చేశారు.

News December 11, 2025

‘మిస్సింగ్ కింగ్’ అంటూ పోస్టులు.. కారణమిదే!

image

‘మిస్సింగ్ కింగ్’ అంటూ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ SMలో ఎమోషనల్ పోస్టులు పెడుతున్నారు. దీనికి కారణం ICC టెస్ట్ బ్యాటర్ల ర్యాంకింగ్సే. ఇందులో వరుసగా తొలి 3 స్థానాల్లో రూట్(ENG), కేన్(NZ), స్మిత్ (AUS) ఉన్నారు. దీంతో ఈ లిస్టులో కోహ్లీ మిస్ అయ్యారంటూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. టెస్ట్ క్రికెట్‌లో ఈ నలుగురిని ఫ్యాబ్-4గా పేర్కొంటారు. కోహ్లీ రిటైరవ్వగా, మిగతా ముగ్గురూ ఇంకా టెస్టుల్లో కొనసాగుతున్నారు.