News October 13, 2025
తిరుపతి జిల్లాలో ITI చదవాలి అనుకుంటున్నారా?

తిరుపతి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కాలేజీల్లో మిగిలిన సీట్లకు 5వ విడత ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు తిరుపతి ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ గణేశ్ ఓ ప్రకటన విడుదల చేశారు. పదో తరగతి పాస్/ ఫెయిల్ అయిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులకు చివరి తేదీ అక్టోబర్ 16. మరిన్ని వివరాలకు దగ్గరలోని ఐటీఐ కాలేజీని సంప్రదించాలి.
Similar News
News October 13, 2025
ఎస్పీ ఆధ్వర్యంలో గ్రీవెన్స్ డే.. 35 ఫిర్యాదులు స్వీకరణ

ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ప్రతీ సోమవారం నిర్వహించే పోలీస్ గ్రీవెన్స్ డే కార్యక్రమం జిల్లా పోలీసు కార్యాలయంలో విజయవంతంగా ముగిసింది. ఎస్పీ శరత్ చంద్ర పవార్ దాదాపు 35 మంది అర్జీదారులతో మాట్లాడి వారి సమస్యలను విన్నారు. సమస్యలను త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ప్రజలకు పోలీస్ శాఖను చేరువ చేయడమే తమ లక్ష్యమని ఎస్పీ తెలిపారు.
News October 13, 2025
గుండెపోటుతో కమెడియన్ మృతి

కన్నడ కమెడియన్, బిగ్‌బాస్-7 కంటెస్టెంట్ రాజు తాలికొటే మరణించారు. నిన్న అర్ధరాత్రి గుండెపోటుకు గురైన ఆయనను కర్ణాటకలోని ఉడుపి మణిపాల్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మనసారె, పంచరంగి, లైఫ్ ఈజ్ దట్, రాజ్‌ధాని, మైనా, టోపీవాలా వంటి చిత్రాల్లో ఆయన నటించారు. BB-7లో పాల్గొనడంతో పాటు పలు టీవీ సీరియళ్లలోనూ సందడి చేశారు. రాజు మృతి పట్ల కర్ణాటక Dy.CM డీకే శివకుమార్ సంతాపం తెలిపారు.
News October 13, 2025
ASF: అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్

జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెంకటేష్ ధోత్రే సూచించారు. సోమవారం ASF కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇంజినీరింగ్, రోడ్లు భవనాలు, గిరిజన సంక్షేమ శాఖ ఇంజినీరింగ్ అధికారులతో అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.