News December 30, 2025

తిరుపతి: జిల్లా పునర్వ్యవస్థీకరణపై తుది నోటిఫికేషన్ విడుదల

image

APలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ప్రభుత్వం తుది నోటిఫికేషన్ విడుదల చేసింది. డిసెంబర్ 31 నుంచి అమల్లోకి వచ్చేలా నెల్లూరు, తిరుపతి జిల్లాల మధ్య రెవెన్యూ డివిజన్లు–మండలాల పునర్విభజన చేపట్టారు. కొండాపురం, VKపాడును కావలి డివిజన్‌లోకి, గూడూరు, చిల్లకూరు, కోటను గూడూరు డివిజన్‌లోకి చేర్చారు. వాకాడు, చిట్టమూరు(M)ను S.పేట డివిజన్‌లోకి, బాలయపల్లి, వెంకటగిరి, డక్కిలిని శ్రీకాళహస్తి డివిజన్‌లోకి విలీనం చేశారు.

Similar News

News January 3, 2026

ఇవాళ సూపర్ మూన్.. ఎన్ని గంటలకంటే?

image

ఇవాళ సూపర్ మూన్ కనువిందు చేయనుంది. పౌర్ణమి సందర్భంగా 6PM నుంచి కనిపించనుంది. సాధారణం కంటే 15% పెద్దగా, 30% ప్రకాశవంతంగా చంద్రుడు దర్శనమిస్తాడు. ఈ అద్భుత దృశ్యాన్ని నేరుగానే వీక్షించవచ్చు. ఆ సమయంలో ఎర్త్‌కు 3.6 లక్షల KM దూరంలో చందమామ ఉంటాడట. భూమికి దగ్గరగా చంద్రుడు రావడం, అదే టైమ్‌లో సూర్యుడికి భూమి దగ్గరగా ఉండటం, సూర్యుడికి చంద్రుడు పూర్తి ఎదురుగా రావడంతో సూపర్ మూన్ వెలిగిపోనుంది.

News January 3, 2026

కొడుకు, కోడలు క్యూట్ ఫొటో షేర్ చేసిన ప్రియాంకా గాంధీ

image

కాంగ్రెస్ MP ప్రియాంకా గాంధీ కొడుకు రైహాన్ త్వరలో <<18710916>>పెళ్లి<<>> చేసుకోనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొడుకు, కాబోయే కోడలు క్యూట్ ఫొటోలను ఆమె షేర్ చేశారు. వారిద్దరూ మూడేళ్ల వయసు నుంచే బెస్ట్ ఫ్రెండ్స్ అని పేర్కొన్నారు. ‘మీ ఇద్దరినీ ఎంతో ప్రేమిస్తున్నా. ఎల్లప్పుడూ ఒకరినొకరూ ప్రేమించుకుంటూ, గౌరవించుకుంటూ ఉండండి. మూడేళ్ల వయసు నుంచీ ఉన్నట్లే ఎప్పటికీ బెస్ట్ ఫ్రెండ్స్‌గా కొనసాగండి ’ అని రాసుకొచ్చారు.

News January 3, 2026

HNK:అవమానం భరించలేక యువకుడి సూసైడ్

image

అవమానం భరించలేని యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై పరమేశ్వర్ కథనం ప్రకారం.. HNK జిల్లా శాయంపేట మండలం నేరేడుపల్లికి చెందిన మేకల బన్నీ(19) తన అక్క భర్త గణేష్, మామ, వారి బంధువు భాస్కర్ దుర్భాషలాడి దాడి చేయడంతో అవమానం భరించలేకపోయాడు. ఈ క్రమంలో ఉరేసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో ముగ్గురిపై కేసు నమోదు అయింది.