News March 19, 2025

తిరుపతి జిల్లా ప్రజలకు గమనిక

image

తిరుపతి కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే జరుగుతుంది. వచ్చే సోమవారం నుంచి గ్రీవెన్స్ డే సమయాన్ని మార్చారు. ఈనెల 24వ తేదీన ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకే ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారు. ఈ విషయాన్ని తిరుపతి జిల్లా ప్రజలు గమనించాలని కలెక్టరేట్ అధికారులు కోరారు.

Similar News

News July 6, 2025

మహిళల రక్షణ కోసం ‘SWAT’ బృందం

image

HYD నగర పోలీసులు మహిళల భద్రత, నిరసన ప్రదర్శనల నిర్వహణ కోసం 35 మంది మహిళా పోలీసులతో “స్విఫ్ట్ ఉమెన్ యాక్షన్ టీమ్(SWAT)”ను ప్రారంభించారు. కరాటే, నిరాయుధ పోరాటంలో ప్రత్యేక శిక్షణ పొందిన ఈ బృందం ధర్నాలు, ర్యాలీలు, ముఖ్యమైన ఈవెంట్లు, పండుగల సమయంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషిచేస్తుంది. సరికొత్త యూనిఫాంలో సచివాలయం వద్ద విధుల్లో చేరిన ఈ బృందం.. మహిళల ఆందోళనలు నియంత్రించడంలో కీలకపాత్ర పోషించనుంది.

News July 6, 2025

విజయవాడ: భక్తులతో కిటకిటలాడిన కనకదుర్గమ్మ ఆలయం

image

ఆషాడ మాసపు చివరి ఆదివారం, తొలి ఏకాదశి కావడంతో కనకదుర్గమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వందలాది సారె బృందాలు అమ్మవారిని దర్శించుకున్నాయి. మహా మండపం ఆరవ అంతస్తులో శాకాంబరీ ఉత్సవాలకు భక్తులు సమర్పించిన కాయగూరలు, పండ్లను ఈవో శీనా నాయక్ పరిశీలించారు. సారె బృందాల కోసం లిఫ్ట్, దర్శన మార్గాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

News July 6, 2025

సీక్రెట్ కెమెరాలను ఎలా గుర్తించాలంటే?

image

మహిళలు పబ్లిక్ టాయిలెట్లు, ఛేంజింగ్ రూమ్‌లు, హోటల్ గదులకు వెళ్లినప్పుడు అక్కడి <<16963972>>వస్తువులను<<>> నిశితంగా పరిశీలించాలి. గదుల్లో లైట్ ఆఫ్ చేసి, LED లైట్ వంటివి కనిపిస్తాయో చెక్ చేయాలి. అద్దంపై వేలు పెట్టి చూస్తే మీ వేలుకి, అద్దంలో వేలు ప్రతిబింబానికి మధ్య గ్యాప్ లేకపోతే అక్కడ ఏదో ఉందని అనుమానించాలి. సీక్రెట్ కెమెరాల డిటెక్ట్ యాప్‌లు ఉన్నా వాటిలో చాలావరకు మోసపూరితమైనవేనని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.