News January 15, 2026

తిరుపతి జిల్లా ప్రజలు ఈ నంబర్ సేవ్ చేసుకోండి

image

ప్రైవేట్ బస్సుల అధిక ఛార్జీలను నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి కొర్రపాటి మురళీమోహన్ తెలిపారు. ఆన్‌లైన్ బుకింగ్ యాప్‌లపై నిరంతర పర్యవేక్షించడంతో పాటు ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేస్తున్నామన్నారు. RTC ఛార్జీలపై 50శాతం కంటే ఎక్కువ వసూలు చేయరాదన్నారు. ఎక్కడైనా ఎక్కువ ఛార్జీలు ఉంటే ప్రయాణికులు 92816 07001కు కాల్ చేయాలని కోరారు.

Similar News

News February 20, 2026

పి.గన్నవరం: అనుమానాస్పద స్థితిలో టెన్త్ విద్యార్థిని మృతి

image

ముంగండ ZPH స్కూల్ 10వ తరగతి విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో గురువారం మృతి చెందింది. మృతదేహాన్ని స్కూల్ సమీపంలోని మంచినీటి చెరువులో కనుగొన్నారు. సాయంత్రం వరకు స్కూలు ప్రాంగణంలో వాలీబాల్ ఆడిందని సహచర విద్యార్థులు తెలిపారు. ఆమె ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆరా తీశారు. అనుమానం వచ్చి చెరువును పరిశీలించగా కరుణ మృతదేహం లభ్యమయింది. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News February 20, 2026

ఆరోగ్యకర జీవితానికి 8 అలవాట్లు!

image

ఆరోగ్యకర జీవితానికి 8 అలవాట్లను అలవరచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ‘నిద్ర లేవగానే కొద్దిసేపు ప్రశాంతంగా గడపండి. 10 నిమిషాలు ఎండలో ఉండండి. తిన్నాక 10 నిమిషాలు నడవండి. వారంలో 3 సార్లయినా పెరుగు, యోగర్ట్, కెఫీర్ తీసుకోండి. మందు, సిగరెట్లు వద్దు. పసుపు, జీలకర్ర, సోంపు, మిరియాలను ఆహారంలో చేర్చుకోండి. 12 గం. భోజన సమయాన్ని ఫాలోకండి.. మిగతా 12 గం. ఏమీ తినొద్దు. 7-8 గంటలు నిద్రపోండి’ అని చెబుతున్నారు.

News February 20, 2026

సంతోషిమాత వ్రతం: పాటించాల్సిన నియమాలు

image

ఈ వ్రతంలో అత్యంత కఠినమైన నియమం పులుపు పదార్థాలకు దూరంగా ఉండటం. వ్రతం చేసే వ్యక్తితో పాటు కుటుంబ సభ్యులు కూడా ఆ రోజున నిమ్మకాయ, చింతపండు, పెరుగు ముట్టుకోకూడదు. ఇంట్లో పులుపుతో వంటలు చేయకూడదు. వ్రతం రోజున అబద్ధాలు ఆడటం, ఇతరులను దూషించడం చేయరాదు. పూర్తి బ్రహ్మచర్యం పాటించాలి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. అమ్మవారి నామస్మరణ చేయాలి. నైవేద్యంగా పెట్టిన బెల్లం, శనగలను మాత్రమే ప్రసాదంగా తీసుకోవాలి.