News December 1, 2025

తిరుపతి జిల్లా ప్రైవేట్ స్కూల్లో భారీ మోసం

image

పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్నాయి. ఇప్పటికే నామినల్ రోల్స్ ప్రక్రియ కొనసాగుతుండగా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు దోపిడీకి తెరలేపాయి. జిల్లాలో 271 ప్రైవేట్ స్కూల్స్ ఉండగా.. 12,796 మంది పది పరీక్షలు రాయనున్నారు. పదో తరగతి పరీక్ష ఫీజు రూ.125 వసూలు చేయాలని ఆదేశాలు ఉన్నాయి. కానీ చాలా స్కూల్లో రూ.1000 తీసుకుంటున్నారు. అధికారులకు తెలిసే ఇదంతా జరుగుతుందని ఆరోపణలు ఉన్నాయి. మీరు ఎంత కట్టారో కామెంట్ చేయండి.

Similar News

News March 6, 2026

గిరిజన ప్రాంతాల్లో విద్యుద్దీకరణకు ప్రాధాన్యం: సీఎండీ

image

గిరిజన ప్రాంతాల్లో విద్యుత్ సౌకర్యాల విస్తరణకు ఎన్పీడీసీఎల్ ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు సీఎండీ వరుణ్ రెడ్డి తెలిపారు. ఈఆర్సీ బహిరంగ విచారణలో మాట్లాడుతూ.. PM-JANMANపథకం కింద దూర ప్రాంతాల్లోని 3360 ఇళ్లకు ఆన్‌గ్రిడ్ ద్వారా, 90 ఇళ్లకు ఆఫ్‌గ్రిడ్ ద్వారా విద్యుద్దీకరణ పూర్తి చేసినట్లు వెల్లడించారు. అలాగే STSDF పథకం ద్వారా గుర్తించిన 2222 గిరిజన ఆవాసాల్లో 2072 ప్రాంతాల్లో విద్యుద్దీకరణ చేశామన్నారు.

News March 6, 2026

ఎల్లుండి ఫైనల్.. అభిషేక్ శర్మ వైపే మొగ్గు!

image

T20WCలో వరుసగా విఫలం అవుతున్న అభిషేక్ శర్మను పక్కన పెట్టాలనే డిమాండ్స్ వస్తున్నాయి. అయితే అతడికి ఫైనల్లోనూ ఛాన్స్ ఇవ్వాలని టీమ్ యాజమాన్యం యోచిస్తున్నట్లు PTI తెలిపింది. అభిషేక్ దూకుడును సపోర్ట్ చేయాలని మేనేజ్‌మెంట్ భావిస్తోందని పేర్కొంది. టీమ్‌లో మార్పులు చేస్తే కాంబినేషన్ డిస్టర్బ్ అవుతుందని, అందుకే ఫైనల్లో మార్పులు ఉండకపోవచ్చని పేర్కొంది.

News March 6, 2026

భద్రాద్రి శ్రీరామనవమి, పట్టాభిషేకం టికెట్ కౌంటర్లు ఎక్కడంటే.!

image

ఈనెల 27, 28 తేదీలలో భద్రాద్రి శ్రీరామనవమి, పట్టాభిషేకం మహోత్సవాలను వీక్షించే భక్తులకు సెక్టార్ల వారీగా టికెట్లను ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా విక్రయించినట్లు ఆలయ ఈవో ప్రకటనలో వెల్లడించారు. ఆఫ్లైన్ టికెట్ల విక్రయానికి ప్రత్యేక కౌంటర్లు: 1.ఆలయము వద్ద మెయిన్ టిక్కెట్ కౌంటర్, 2.తానీషా కళ్యాణ మండపం CRO, 3.బ్రిడ్జి పాయింట్ CRO, 4. భద్రాచలం సబ్ కలెక్టర్ ఆఫీస్ ప్రాంతాలలో కౌంటర్లను ఏర్పాటు చేశారు.