News October 25, 2025
తిరుపతి: జిల్లా వ్యాప్తంగా పీజీఆర్ఎస్ రద్దు

మొంథా తుఫాను కారణంగా జిల్లా వ్యాప్తంగా సోమవారం నిర్వహించే PGRS రద్దు చేసినట్లు తిరుపతి కలెక్టర్ డా.వెంకటేశ్వర్ తెలిపారు. అన్ని జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు “మొంథా” తుఫాను కారణంగా సహాయకచర్యలలో ఉన్నారని తెలిపారు. ప్రజలెవ్వరికీ ఇబ్బంది కలగకుండా ఉండేందుకు సోమవారం నాటి కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా రద్దు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
Similar News
News October 26, 2025
రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్లో కంట్రోల్ రూములు ఇవే.!

జిల్లా కంట్రోల్ రూమ్ ➢ 0883–2944455 రాజమహేంద్రవరం ఆర్డీఓ ➢0883–2442344
రాజమహేంద్రవరం అర్బన్ ➢0883–2940695 రాజమహేంద్రవరం రూరల్➢9849903860
కడియం➢6301523482 రాజానగరం➢9494546001 రంగంపేట➢ 9393931667 కోరుకొండ➢9154474851 అనపర్తి➢9441386920 బిక్కవోలు➢ 9849903913 సీతానగరం➢9177096888 గోకవరం➢9491385060 కాల్ చేయాలని కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు.
News October 26, 2025
కార్తీకంలో ఈ శ్లోకం పఠించి స్నానం చేస్తే

సర్వపాపహరం పుణ్యం స్నానం కార్తీక సంభవం|
నిర్విఘ్నం కురు మే దేవ దామోదర నమోస్తుతే||
‘ఓ దామోదరా, అన్ని పాపాలను పోగొట్టే పుణ్యమైన ఈ కార్తీక మాస వ్రతాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేయి. నీకు నమస్కారం అని’ అని ఈ శ్లోక అర్థం. కార్తీక మాసంలో ఈ శ్లోకం పఠించి సూర్యోదయానికి ముందే నదీ స్నానం చేయాలని పురాణాలు చెబుతున్నాయి. దీనివల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని పేర్కొంటున్నాయి.
News October 26, 2025
ఫెడరల్ బ్యాంక్‌లో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

ఫెడరల్ బ్యాంక్ సేల్స్& క్లయింట్ అక్విజిషన్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి రేపే ఆఖరు తేదీ. పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 27ఏళ్లలోపు ఉండాలి. రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.800, ST,SCలకు రూ.160. రాత పరీక్ష నవంబర్ 16న నిర్వహిస్తారు. వెబ్‌సైట్:https://www.federalbank.co.in/


