News April 4, 2024
తిరుపతి జిల్లా సిద్ధమా..?: జగన్

ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర జరుగుతోంది. నిన్న పూతలపట్టులో సభ అనంతరం ఆయన తిరుపతి జిల్లాలోకి ప్రవేశించారు. ఇవాళ తిరుపతి జిల్లాలో డ్రైవర్లతో సమావేశం అవుతారు. అలాగే రోడ్ షోతో పాటు నాయుడుపేటలో బహిరంగ సభ జరగనుంది. ఈక్రమంలో సీఎం జగన్ ‘Day-8 తిరుపతి జిల్లా సిద్ధమా…?’ అని ట్వీట్ చేశారు.
Similar News
News October 2, 2025
చిత్తూరు: ఈ నియోజకవర్గాల్లో ఇప్పటికీ పెద్దిరెడ్డిదే హవా?

గతంలో సీమను తన కనుసన్నల్లో శాసించిన పెద్దిరెడ్డి హవానే ఇప్పటికీ కొన్ని నియోజకవర్గాల్లో సాగుతోందట. పుంగనూరు, తంబళ్లపల్లె, మదనపల్లి, జీడీ నెల్లూరు, పీలేరు, పలమనేరులో బాహాటంగానే పెద్దిరెడ్డి అనుచరులు టీడీపీలో చేరి ఆయనకు సహకరిస్తున్నారట. గత ప్రభుత్వం హయాంలో పెత్తనం చెలాయించిన నేతలు ఇప్పుడు టీడీపీ కండువా కప్పుకుని గ్రావెల్, ఇసుక దందా, అక్రమం మైనింగులకు పాల్పడుతున్నట్లు తెలుగుతమ్ముళ్లు ఆరోపిస్తున్నారు.
News October 2, 2025
చిత్తూరు: ఎనిమిది KGBVల్లో సీసీ కెమెరాలు

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న కేజీబీవీల్లో బాలికల భద్రత నిమిత్తం సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా సమగ్రశిక్షా శాఖ ఏపీసీ వెంకటరమణ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని 8 కేజీబీవీలకు సీసీ కెమెరాలను మంజూరు చేసిందన్నారు. వీటిల్లో ప్రత్యేక బృందం సీసీ కెమెరాలను అమర్చుతారన్నారు.
News October 2, 2025
రూ.200 కొట్టు.. పెన్షన్ నగదు పట్టు.!

పలమనేరులో ప్రభుత్వ పథకాల పంపిణీలో కొందరు సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు సమాచారం. వృద్ధులు, మంచాన ఉన్నవారికి ఇంటి వద్దనే పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే కొందరు ఉద్యోగులు లబ్ధిదారుల నుంచి రూ.200 తీసుకుంటున్నట్లు ఆరోపణలు. ఇవ్వని వారిని తిప్పించుకోవడం, ఆలస్యం చేయింయడం వంటివి చేస్తున్నారట. దీనిపై అధికారులు దృష్టి సారించాలని పలువురు కోరారు. మీ ఏరియాలో పెన్షన్ పంపిణీ ఎలా జరుగుతోంది?