News March 4, 2025

తిరుపతి: తల్లి ఆచూకీ కోసం తల్లడిల్లుతున్న జవాను

image

తిరుపతి జిల్లా తిరుమల లోని తన తల్లి ఆచూకీ తెలిస్తే చెప్పండి అంటూ ఒక జవాను సెలవు పెట్టి తిరుపతి పరిసర ప్రాంతాల్లో చేతిలో ఫొటో పట్టుకొని వెతుకుతున్నాడు. సెలవులు ముగిసి నేపాల్ సరిహద్దులో ఉద్యోగానికి వెళ్లలేక ఇటు తల్లి ఆచూకీ కానరాక తల్లికోసం జవాను తల్లడిల్లుతున్నాడు. సోమవారం తిరుపతి కలెక్టర్‌ని కలిసి తన తల్లి మిస్సింగ్ కేసును సీరియస్‌గా తీసుకోమని ఫిర్యాదు చేశాడు.

Similar News

News March 4, 2025

టీమ్ ఇండియా ఆందోళనంతా అతడి గురించే: DK

image

టీమ్ ఇండియాకు ఆస్ట్రేలియా జట్టుతో భయం లేదు కానీ మానసికంగా ట్రావిస్ హెడ్ అనే అడ్డంకి ఆటగాళ్ల మైండ్‌లో ఉంటుందని మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ అంచనా వేశారు. ‘గతంలో నాకౌట్ గేమ్స్‌లో న్యూజిలాండ్‌తో ఆడుతున్నప్పుడు ఇలాంటి భావన ఉండేది. కానీ ఇప్పుడు ఆస్ట్రేలియా అద్భుతంగా ఆడుతోంది. హెడ్ వికెట్ తీస్తే భారత్ ఊపిరి పీల్చుకోవచ్చు’ అని DK పేర్కొన్నారు.

News March 4, 2025

ఖమ్మం: ఇంటర్ పరీక్షలు.. 72 కేంద్రాలు ఏర్పాటు

image

ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాలో 36,600మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానుండగా 72 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఖమ్మం డీఐఈఓ కె.రవిబాబు తెలిపారు. ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాల నిఘా ఉంటుందని, హాల్ టికెట్ నేరుగా డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించగా, దానిపై సెంటర్ చిరునామా తెలుసుకునేలా క్యూఆర్ కోడ్ ఉంటుందన్నారు. 

News March 4, 2025

సిరాజ్‌తో డేటింగ్ చేయట్లేదు: మహీరా శర్మ

image

IND క్రికెటర్ సిరాజ్‌తో <<15305689>>డేటింగ్ వార్తలను<<>> బాలీవుడ్ నటి మహీరా శర్మ ఖండించారు. తాను ఎవరితోనూ రిలేషన్‌లో లేనని స్పష్టం చేశారు. ఫ్యాన్స్ ఎవరితోనైనా సంబంధం కలిపేస్తారని, వాటిని ఆపలేమని పేర్కొన్నారు. ‘కో స్టార్లతో రిలేషన్‌ ఉందంటారు. ఎడిటెడ్ ఫొటోలను SMలో పోస్టు చేస్తారు. వాటికి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు’ అని పేర్కొన్నారు. ఇటీవల ఆమె తల్లి సానియా శర్మ కూడా డేటింగ్ వార్తలను కొట్టిపారేశారు.

error: Content is protected !!