News October 18, 2025
తిరుపతి: దొంగలు అరెస్ట్.. రూ.25 లక్షల సొత్తు స్వాధీనం

తిరుపతి జిల్లాలో ప్రయాణికుల బ్యాగుల్లో బంగారు నగలు దొంగిలించే ముగ్గురు మహిళా దొంగలను, ఇద్దరు మోటార్ సైకిల్ దొంగలను తిరుపతి క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.25 లక్షల విలువచేసే 230 గ్రాముల బంగారు నగలు, 4 బైకులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా అడిషనల్ ఎస్పీలు నాగభూషణరావు, రవి మనోహర్ ఆచారి వివరాలను మీడియాకు వెల్లడించారు.
Similar News
News October 18, 2025
న్యాయవ్యవస్థలు దిగొస్తాయని నమ్ముతున్నాం: ఆర్.కృష్ణయ్య

TG: రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం నిర్వహించిన బంద్ విజయవంతమైందని బీసీ జేఏసీ ఛైర్మన్, ఎంపీ ఆర్.కృష్ణయ్య చెప్పారు. బీసీల డిమాండ్ న్యాయమని భావించి మద్దతిచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు. రిజర్వేషన్ల విషయంలో న్యాయవ్యవస్థలు దిగివస్తాయని నమ్ముతున్నామని పేర్కొన్నారు. బీసీ కులాల గౌరవం, పేదరిక నిర్మూలన కోసం తాము పోరాటం చేస్తున్నామని అన్నారు.
News October 18, 2025
బీచ్‌లో లైట్లు ఏవి..? అధికారులపై మేయర్ ఆగ్రహం

విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు శనివారం రాత్రి ఆర్కే బీచ్ పరిసరాలను పరిశీలించారు. బీచ్‌లో విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయనందుకు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు నెలల క్రితమే ఆదేశించినా చర్యలు తీసుకోలేదని మేయర్ విమర్శించారు. బీచ్‌లో హైమాస్ట్ లైట్లు వెలగక సందర్శకులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అలాగే పరిశుభ్రతపై శ్రద్ధ వహించి, బీచ్ అందాన్ని కాపాడాలని సూచించారు.
News October 18, 2025
ఎచ్చెర్ల: డిగ్రీ 5వ సెమిస్టర్ షెడ్యూల్ విడుదల

డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ ఐదవ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్‌ను యూనివర్సిటీ డీన్ శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పరీక్ష ఫీజులను ఎటువంటి అపరాధ రుసుము లేకుండా అక్టోబర్ 31వ తేదీ వరకు సంబంధిత కళాశాలల్లో చెల్లించవచ్చని తెలిపారు. ఈ పరీక్షలు నవంబర్ చివరి వారంలో జరుగుతాయని వెల్లడించారు.