News April 11, 2025
తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్యకు ప్రశంస

రాష్ట్రంలో పన్నుల వసూళ్లలో తిరుపతి నగరపాలక సంస్థ మూడో స్థానంలో నిలచింది. రాష్ట్ర పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ అధికారులు కమిషనర్ ఎన్.మౌర్యను అభినందించారు. ఈ మేరకు గురువారం ఆ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని కమిషనర్లకు తిరుపతిలో ఒక్క రోజు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు ఎన్.మౌర్యను అభినందించారు.
Similar News
News July 5, 2025
MBNR: కేసీఆర్ నివాసంలో నాయకుల సమావేశం

మాజీ సీఎం కేసీఆర్‌ను ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతలు శనివారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ పరిస్థితులు, ప్రస్తుత రాజకీయాలపై చర్చించారు. కలిసిన వారిలో అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరాజు, మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రావుల చంద్రశేఖర్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఉన్నారు.
News July 5, 2025
టెట్ ప్రిలిమినరీ కీ విడుదల

తెలంగాణ టెట్ ప్రాథమిక కీ విడుదలైంది. ఈ నెల 8 వరకు అభ్యంతరాలు తెలపవచ్చని అధికారులు పేర్కొన్నారు. గత నెల 18 నుంచి 30 వరకు 9 రోజుల పాటు 16 సెషన్లలో టెట్ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. పేపర్-1కు 74.65శాతం, పేపర్-2(మ్యాథ్స్ అండ్ సైన్స్)కు 73.48, పేపర్-2(సోషల్ స్టడీస్)కు 76.23శాతం అభ్యర్థులు హాజరయ్యారు. కీ కోసం ఇక్కడ <
News July 5, 2025
సూర్యాపేట: శ్రీనివాస్ మృతి.. రూ.10 లక్షల పరిహారం ప్రకటించిన మంత్రి

మఠంపల్లి మండలం చెన్నాయిపాలెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త కుర్రి శ్రీనివాస్ నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసందే. ఈరోజు నకిరేకల్ ప్రభుత్వ వైద్యశాలలో ఆయన మృతదేహానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నివాళులర్పించారు. ఇద్దరు కూతుళ్లు ఉన్న శ్రీనివాస్ కుటుంబానికి తక్షణ సహాయం కింద రూ.10లక్షలు ప్రకటించారు. శ్రీనివాస్ భార్యకు ఉద్యోగం కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.