News November 8, 2025
తిరుపతి: న్యూ లుక్‌లో పవన్ కళ్యాణ్

న్యూ లుక్‌లో డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ని అలరిస్తున్నారు. ఫారెస్ట్ ఆఫీసర్ డ్రెస్ కోడ్‌తో తిరుపతిలో ఆయన పర్యటించారు. కెన్నెట్ అండర్సన్ రాసిన మ్యాన్ ఈటర్స్ అండ్ జంగల్ కిల్లర్స్ బుక్‌ను ఫారెస్ట్‌లో చదివి ఆహ్లాద వాతావరణంలో ఆనందంగా కనిపించారు. మామండూరు అందాలకు మంత్రముగ్ధుడయ్యారు. జలపాతం అందాలను చూసి మైమరచి పోయారు. 105 ఏళ్ల నాటి అతిథి గృహాన్ని సందర్శించడంతోపాటు ఆ ప్రదేశంలో మొక్కలు కూడా నాటారు.
Similar News
News April 5, 2026
చిత్తూరు జిల్లాలో నేటి చికెన్ ధరలు

చిత్తూరు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.148 నుంచి రూ.154, మాంసం రూ.215 నుంచి 246 వరకు పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.244 నుంచి రూ.271 వరకు విక్రయిస్తున్నారు. మరోవైపు 12 కోడిగుడ్ల ధర రూ.66 ఉంది. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News April 5, 2026
తూ.గో: 13 ఏళ్ల బాలికపై అత్యాచారం

తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లగా, ఇంట్లో ఒంటరిగా ఉన్న 13 ఏళ్ల బాలికపై పొరుగింటి వ్యక్తి పెనుముచ్చి మంగరాజు (45) లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం బయటపెడితే చంపేస్తానని బెదిరించాడు. బాధితురాలు తల్లిదండ్రులకు విషయం చెప్పగా, వారి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ శివప్రసాద్ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోంది.
News April 5, 2026
ఖమ్మం డీసీసీబీకి రాష్ట్రంలో రెండో స్థానం

ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.4338 కోట్ల టర్నోవర్‌తో రాష్ట్రంలో రెండో స్థానం సాధించింది. ఈ మేరకు సీఈవో NV ఆదిత్య శనివారం తెలిపారు. గతేడాదితో పోలిస్తే రూ.878 కోట్ల వ్యాపారం పెరిగిందన్నారు. 2024-25లో రూ.5.30 కోట్ల లాభాలు నమోదు కాగా, ఈ ఏడాది రూ.30 కోట్ల లాభాలు సాధించింది. సంఘం వాటాదారులకు రూ.6 కోట్ల డివిడెండ్ అందించినట్లు వెల్లడించారు.


