News April 8, 2025
తిరుపతి: పింఛన్ నగదుతో అధికారి పరార్..?

తిరుపతి జిల్లా సత్యవేడులో మరో ఉద్యోగి పింఛన్ డబ్బులు పంపిణీ చేయలేదు. సత్యవేడు-1 సచివాలయంలో 64 మందికి పింఛన్ ఇవ్వడానికి VRO చిట్టిబాబుకు రూ.2.68 లక్షలు అందాయి. 48మందికి రూ.2.02 లక్షలు పంపిణీ చేసి.. 16 మందికి ఆయన ఇవ్వలేదు. వారం నుంచి ఆయన అడ్రస్ లేకుండా పోయారు. ఫోన్ సైతం స్విచ్ఛాప్ వస్తోంది. ఇదే మండలంలోని కాళమనాయుడుపేట సచివాలయ ఉద్యోగి షాహిదుల్లా రూ.2.63లక్షల పింఛన్ నగదుతో పారిపోయిన విషయం తెలిసిందే.
Similar News
News April 17, 2025
HYD: 19న MIM భారీ పబ్లిక్ మీటింగ్

వక్ఫ్ సవరణ చట్టం-2025కి వ్యతిరేకంగా MIM పార్టీ ఈనెల 19న శనివారం భారీ పబ్లిక్ మీటింగ్‌ను నిర్వహించనుంది. దీనికి సంబంధించి నగరంలో ఇప్పటికే ‘చలో దారుస్సలామ్’ పేరుతో పెద్ద పెద్ద బ్యానర్లు, హోర్డింగ్లు వెలిశాయి. కేంద్రం తెచ్చిన ఈ చట్టం రాజ్యాంగ విరుద్దమని ముస్లిం సంఘాలు, పార్టీలు ఆరోపిస్తున్న వేళ ఈ సభ నిర్వహణ ప్రాధాన్యతను సంతరించుకుంది. కాగా, వక్ఫ్ (సవరణ) బిల్లు ఏప్రిల్ 8 నుంచి అమల్లోకి వచ్చింది.
News April 17, 2025
రెవెన్యూ సదస్సులకు చర్యలు: ములుగు కలెక్టర్

భూభారతి కోసం ములుగు జిల్లాలోని వెంకటాపూర్ మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని రెవెన్యూ సదస్సులు నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. మే 1 నుంచి 31 వరకు పరిశీలన చేసి, జూన్ 2వ తేదీన పట్టాలు అందజేయడం జరుగుతుందన్నారు. మిగతా మండల కేంద్రాల్లో భూముల వివరాలు పూర్తిగా తహశీల్దార్, ఆర్డీవో, కలెక్టర్, ఖజానా కార్యాలయంలో పొందుపరచడం జరుగుతుందన్నారు.
News April 17, 2025
రోడ్డు ప్రమాద నివారణపై కొత్తగూడెం కలెక్టర్ సమీక్ష

రోడ్డు ప్రమాదాలు జరగకుండా భద్రత ప్రణాళిక రూపొందించాలని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. బుధవారం జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ఎక్కువ నిడివి గల నేషనల్ హైవేతో పాటు, R&B, పంచాయతీ రహదారులు ఉన్నాయన్నారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరిగే స్థలాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదాలు జరిగినప్పుడు తక్షణ చికిత్స కోసం ప్రణాళిక రూపొందించాలని DMHOను ఆదేశించారు.