News April 2, 2024
తిరుపతి: పీజీ ఫలితాలు విడుదల

SV యూనివర్సిటీ పరిధిలో గత
ఏడాది సెప్టెంబర్ నెలలో PG మొదటి సంవత్సరం ఏంఏ హిందీ, ఎంఏ ఫిలాసఫీ, ఎమ్మెస్సీ బోటనీ, ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్, ఎంఎస్సీ అంత్రోపాలజీ రెండో సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫలితాలను http://www.manabadi.co.in, http://www.schools9.com వెబ్ సైట్‌లో చూడాలన్నారు.
Similar News
News October 1, 2025
పెన్షన్ల పంపిణీలో చిత్తూరు జిల్లాకు నాలుగో స్థానం

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో చిత్తూరు జిల్లా నాలుగో స్థానంలో నిలిచింది. చిత్తూరు జిల్లా పరిధిలో 2,68,307 పెన్షన్లకు గాను మొదటి రోజు 2,53,480 మంది లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేశారు. రాష్ట్రంలో 95.3%తో అనంతపురం అగ్రస్థానంలో ఉండగా 94.47%తో చిత్తూరు జిల్లా నాలుగో స్థానంలో నిలిచింది. రెండు, మూడు స్థానాల్లో అన్నమయ్య, తిరుపతి జిల్లాలు ఉన్నాయి.
News October 1, 2025
రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన చిత్తూరు ఎస్పీ

ప్రపంచ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా CMC ఆసుపత్రిలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని చిత్తూరు ఎస్పీ తుషార్ డూడి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. రక్తదానం మరొకరి ప్రాణాలు నిలబెట్టే మహోన్నత సేవ అని తెలిపారు. రక్తం దానం చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటామని వివరించారు. రక్తదానాన్ని విస్తృతంగా ప్రచారం కల్పించాలని, యువత ఇందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
News October 1, 2025
CM చంద్రబాబుపై బాంబు దాడి.. నేటికి 22 ఏళ్లు.!

అది అక్టోబర్ 1వ తేదీ 2003. తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు చంద్రబాబు CM హోదాలో తిరుమలకు వస్తున్నారు. సరిగ్గా అలిపిరి తనిఖీ కేంద్రం వద్దకు రాగానే ఒక్కసారిగా బాంబు శబ్దం. అందరూ తేరుకునేలోపే CM ఉన్న కారు గాల్లోకి ఎగిరి పడగా చంద్రబాబు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనకు నేటితో 22 ఏళ్లు. శ్రీవారి దయతోనే తాను ప్రాణాలతో బయటపడినట్లు పలు సందర్భాల్లో CM వ్యాఖ్యానించారు.