News October 21, 2025
తిరుపతి: పోలీస్ అమరవీరులకు నివాళి

తిరుపతిలో పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. పరేడ్ గ్రౌండ్ వద్ద జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు హాజరయ్యారు. అమరవీరులకు కలెక్టర్ నివాళులు అర్పించారు. రేపటి నుంచి అమరవీరుల కుటుంబాలను పరామర్శిస్తామని చెప్పారు. 24 నుంచి 27 వరకు విధ్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నారు.
Similar News
News October 21, 2025
మెప్మా-మన మిత్ర యాప్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు

మహిళా సాధికారత కోసం ప్రభుత్వం పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ఎన్ని రంగాల్లో అవకాశాలు ఉంటే.. అన్ని రంగాలను ఉపయోగించుకోవాలని సీఎం సూచించారు. రాష్ట్రంలోని డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలకు అన్ని రకాల చేయూత ఇవ్వాలని ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో సెర్ప్, మెప్మా విభాగాలపై సీఎం సమీక్ష నిర్వహించి మన మిత్ర యాప్‌ను ప్రారంభించారు.
News October 21, 2025
సిరిసిల్ల: హత్య కేసులో నిందితుడు అరెస్ట్

గత సంవత్సరం జరిగిన మహిళ హత్య కేసులో ప్రధాన నిందితుడని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని SRCL CI కృష్ణ తెలిపారు. SRCL పట్టణంలోని అశోక్ నగర్లో మార్చి 19, 2024లో బీహార్ కు చెందిన రుదాల్ సదా (36) మరో వ్యక్తితో కలిసి రమ అనే మహిళను హత్య చేశారన్నారని CI చెప్పారు. A2 రాంబిక్స్ సదాను గత సంవత్సరంలోనే అరెస్టు చేశామన్నారు. సాంకేతికత ఆధారంతో రుడాల్ సదాను హైదరాబాదులో అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామన్నారు.
News October 21, 2025
బాణసంచా కార్మికులకు బీమా ఉండాల్సిందే: CM

AP: కోనసీమ (D) రాయవరంలో బాణసంచా <<17957968>>పేలుడు<<>> ఘటనలో మృతులకు ₹15 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని CBN ఆదేశించారు. ఒకే షెడ్డులో 14 మంది మాన్యుఫ్యాక్చరింగ్ చేశారని, హార్డ్ మెటీరియల్ వాడడంతో స్పార్క్ వచ్చి ప్రమాదం జరిగిందని అధికారులు నివేదించారు. బాణసంచా తయారీదారులు నిబంధనలు పాటించకుంటే PD కేసులు పెట్టాలని CM ఆదేశించారు. కార్మికులకు వ్యక్తిగత బీమా ఉండాలన్నారు.