News April 11, 2025
తిరుపతి ప్రజలకు గమనిక

తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో ఇంటి పన్నులు, ఖాళీ జాగా పన్నులను చెల్లిస్తే 50 శాతం వడ్డీ మినహాయింపు ఈ నెలాఖరు వరకు పొడిగించినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య శుక్రవారం తెలిపారు. 2024-25 సంవత్సరంలో పెండింగ్ ఉన్న బకాయిలు ఏప్రిల్ 30వ తేదీలోపు ఒకేసారి చెల్లిస్తే ప్రస్తుతమున్న వడ్డీపై 50 శాతం రాయితీ ఇస్తున్నామని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని బకాయిదారులు వినియోగించుకోవాలని కోరారు.
Similar News
News April 18, 2025
IPL: RCBకి బిగ్ షాక్

పంజాబ్‌తో మ్యాచులో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన RCB కష్టాల్లో పడింది. 6.1 ఓవర్లలో 33 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయింది. సాల్ట్ 4, కోహ్లీ 1, లివింగ్‌స్టోన్ 4, జితేశ్ 2, కృణాల్ ఒక పరుగుకే పెవిలియన్ చేరారు. వర్షం కారణంగా పిచ్ బౌలింగ్‌కు అనుకూలిస్తోంది. మ్యాచును 14 ఓవర్లకు కుదించిన విషయం తెలిసిందే. PBKS బౌలర్లలో అర్ష్‌దీప్ 2, బార్ట్‌లెట్, చాహల్, జాన్‌సెన్ తలో వికెట్ తీశారు.
News April 18, 2025
60 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న బీజేపీ నేత

బెంగాల్ BJP రాష్ట్ర మాజీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్(60) పార్టీ కార్యకర్త రింకూ ముజుందార్(51)ను పెళ్లాడారు. ఇప్పటివరకు బ్రహ్మచారిగానే ఉన్న అతను తన తల్లి చివరి కోరిక మేరకు వివాహం చేసుకున్నట్లు తెలిపారు. రింకూకు ఇది రెండో వివాహం కాగా ఓ కుమారుడు కూడా ఉన్నారు. మార్నింగ్ వాక్ సందర్భంగా 2021లో వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. ఇటీవల ఈడెన్ గార్డెన్స్‌లో IPL మ్యాచ్ చూడటానికి వెళ్లి పెళ్లిపై నిర్ణయం తీసుకున్నారు.
News April 18, 2025
గంటాను కలిసిన దేవీశ్రీ ప్రసాద్

భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును ప్రముఖ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ శుక్రవారం ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. పోర్టు స్టేడియంలో శనివారం రాత్రి జరగనున్న సంగీత విభావరి కోసం దేవీశ్రీ ప్రసాద్ విశాఖ వచ్చారు. సినీ సంగీత కార్యక్రమాలను నగర ప్రజలు ఎప్పుడూ ఆదరిస్తారని, ఈ విభావరి కూడా విజయవంతం కావాలని గంటా ఆకాంక్షించారు. తన కొత్త ప్రాజెక్టుల వివరాలను దేవీశ్రీ ప్రసాద్ గంటాతో పంచుకున్నారు.