News April 2, 2025
తిరుపతి: ప్రతి జిల్లాలో డ్రైవింగ్ శిక్షణ కేంద్రం

కేంద్ర ప్రభుత్వ నూతన మార్గదర్శకాల ప్రకారం ప్రతి జిల్లాలో డ్రైవింగ్ శిక్షణ సంస్థ నెలకొల్పేందుకు అనుమతులు ఇస్తున్నామని తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి కొర్రపాటి మురళీమోహన్ తెలిపారు. తిరుపతిలోని ఆర్టీవో కార్యాలయంలో లైట్ మోటార్ వాహనాలు, హెవీ మోటర్ వాహనాల డ్రైవింగ్ స్కూల్ యాజమాన్యాలతో ఆయన సమావేశం నిర్వహించారు. తిరుపతిలో లేదా గ్రామీణ ప్రాంతాల్లో ఈ శిక్షణ సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చని సూచించారు.
Similar News
News April 3, 2025
ఏలేరు కాలువలో ఇద్దరు యువకుల మృతి

ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లి గ్రామంలో ఏలేరు కాలువ పొర్లు వద్ద స్నానానికి దిగి ఇద్దరు యువకులు మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..బుధవారం సాయంత్రం జగ్గంపేట నుంచి ఎనిమిది మంది యువకులు స్నానానికి దిగారని వారిలో ఇద్దరు గల్లంతయ్యారని తెలిపారు. దేవర జీవన్ (17), మొల్లి తరుణ్ మృతి చెందినట్లు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News April 3, 2025
అడ్డతీగలలో పులి సంచారం.. వదంతులే: డీఆర్ఓ

అడ్డతీగల అటవీ రేంజ్ పరిధిలోని రేగులపాడులో బుధవారం పులి సంచరించిందనే సమాచారం వదంతులే అని డీఆర్ఓ రాజారావు తెలిపారు. ఆవు అనారోగ్యంతో మరణించిందన్నారు. ఆవు కళేబరాన్ని కుక్కలు పీక్కు తినడం వల్ల ప్రజలు పులి దాడి చేసిందని అనుకుంటున్నారని పేర్కొన్నారు. పులి సంచారంపై ఆ ప్రాంతంలో ఎటువంటి ఆనవాళ్లు కనిపించలేదన్నారు. ప్రజల ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు.
News April 3, 2025
సిరిసిల్ల: ముగిసిన పదిపరీక్షలు.. పిల్లలపై ఓ కన్నేసి ఉంచండి!

పదోతరగతి పరీక్షలు ముగిశాయి. దీంతో విద్యార్థులు ఫ్రీ బర్డ్స్ లాగా విచ్చలవిడిగా తిరగాలని భావిస్తారు. కావున తల్లిదండ్రులు వారి కదలికలపై ఓ కన్నేసి ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలకు మోటార్ బైకులు ఇవ్వొద్దు. స్నేహితులతో చెరువులకు వెళ్లకుండా చూడాలి. వారు ఈత నేర్చుకుంటానంటే తల్లిదండ్రుల పర్యవేక్షణలో నేర్చుకోవాలి. మత్తుపదార్థాలకు అలవాటు పడుతున్నారా లేదా గమనిస్తూ ఉండాలంటున్నారు. PLEASE SHARE IT.