News January 10, 2026

తిరుపతి: ప్రతి పాఠశాలకు ప్రత్యేకాధికారి..!

image

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన ఫలితాలు లక్ష్యంగా విద్యాశాఖ ప్రత్యేకాధికారిని నియమించింది. విద్యార్థుల బోధన, చదవడం, పరీక్షలు, పది విద్యార్థుల స్టడీ అవర్స్.. 100 శాతం ఉత్తీర్ణత కోసం వీరి పర్యవేక్షణ ఉంటుంది. పిలల్ల సామర్ధ్యాలపై ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లాలో ప్రభుత్వ పాఠశాల పదో తరగతి విద్యార్థులు 13,675 మంది, మున్సిపాలిటి పాఠశాలల్లో 972 మంది చదువుతున్నారు.

Similar News

News January 11, 2026

కోచ్ జెలెజ్నీకి నీరజ్ చోప్రా గుడ్‌బై

image

భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా తన కోచ్ జాన్ జెలెజ్నీతో విడిపోతున్నట్లు ప్రకటించారు. సానుకూల వాతావరణంలోనే వేర్వేరు దారులు ఎంచుకున్నట్లు తెలిపారు. టెక్నిక్, రిథమ్ వంటి వాటిలో కోచ్ ప్రోత్సాహం మరువలేనిదన్నారు. ఇతని ట్రైనింగ్‌లోనే నీరజ్ తన కెరీర్‌లో తొలిసారి 90 మీటర్ల మార్క్‌ను దాటారు. 2028 ఒలింపిక్స్ లక్ష్యంగా ప్రాక్టీస్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ జోడీ ఏడాది పాటు కలిసి పని చేసింది.

News January 11, 2026

ఆదివార వ్రతాన్ని ఎలా ఆచరించాలి?

image

ఆదివార వ్రతాన్ని ఏడాదంతా ఆచరిస్తే శుభ ఫలితాలుంటాయి. అది వీలుకాకపోతే మాసానికొకటి చొప్పున 12 వారాలు చేయవచ్చు. ఆ రోజు సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి. ఎర్ర చందనం, దర్భ కలిపిన జలాన్ని సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి. ఆదిత్య హృదయం, సూర్య మంత్రాలు పఠించాలి. ఉపవాసముంటే ఉత్తమం. పూజ ముగిశాక దంపతులకు భోజనం పెట్టి, దక్షిణ తాంబూలాలు సమర్పించాలి. ఈ వ్రతం చేస్తే ఆరోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్మకం.

News January 11, 2026

రేపు తెనాలి ఐటీఐలో అప్రెంటిస్ మేళా..15 కంపెనీల రాక

image

తెనాలి చినరావురులోని ప్రభుత్వ ఐటీఐ శిక్షణ కేంద్రంలో ఈ నెల 12వ తేదీ సోమవారం నేషనల్ అప్రెంటిస్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ రావి చిన వెంకటేశ్వర్లు తెలిపారు. ఉద్యోగ మేళాలో సుమారు 15 ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయని ఐటిఐ పాసైన విద్యార్థులందరికీ అప్రెంటిస్ షిప్ అవకాశాలు కల్పిస్తాయని చెప్పారు. అర్హత కలిగిన వారు తమ సర్టిఫికెట్లు, బయోడేటా, ఆధార్ కార్డు నకలుతో ఉదయం 10 గంటలకు హాజరు కావాలని చెప్పారు.