News February 18, 2026

తిరుపతి: ప్రిన్సిపల్ సంతకం అవసరం లేదు

image

ఇంటర్ విద్యార్థులు హాల్ టికెట్లను నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని RIO రాజశేఖరరెడ్డి తెలిపారు. ఫీజుల పేరుతో విద్యార్థులను కాలేజీలు వేధిస్తున్నాయని Way2Newsలో <<19174095>>వార్త <<>>రాగా.. ఆయన స్పందించారు. ‘bieap వెబ్‌సైట్, వాట్సాప్ ద్వారా రోల్ నంబర్, పుట్టిన తేదీతో హాల్‌టికెట్ పొందవచ్చు. హాల్ టికెట్‌పైన ప్రిన్సిపల్ సంతకం, స్టాంప్ అవసరం లేదు. విద్యార్థులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు ఉంటాయి’ అని ఆయన హెచ్చరించారు.

Similar News

News February 20, 2026

4,000 నుంచి 550కి ఓలా స్టోర్లు

image

<<19145931>>మార్కెట్ వాటా<<>>తో పాటు డిమాండ్ తగ్గడంతో ఓలా ఎలక్ట్రిక్ తన ఫిజికల్ స్టోర్ల సంఖ్యను తగ్గించుకుంటోంది. గతంలో ఏకంగా 4,000 ఔట్‌లెట్లు ఉండగా మార్చి నాటికి 550కి తగ్గించాలని నిర్ణయించింది. ప్రస్తుతం 700 స్టోర్లు రన్ అవుతున్నాయి. సర్వీస్ క్వాలిటీని పెంచడం, ఖర్చులను తగ్గించుకోవడమే లక్ష్యంగా ఈ ‘బిజినెస్ రీసెట్’ చేపట్టింది. డిసెంబర్‌ క్వార్టర్‌లో కంపెనీ ఆదాయం 55% తగ్గింది. నష్టాలు ₹487Crగా నమోదయ్యాయి.

News February 20, 2026

NZB: నామినేటెడ్ పదవుల కోసం ఆశావహుల ఆరాటం

image

మార్చి15లోగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ప్రకటించడంతో ఆశావహుల్లో ఆరాటం మొదలైంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అసంతృప్తులకు, రెబల్స్‌కు నామినేటెడ్ పోస్టులు, జిల్లా కమిటీల్లో పార్టీ పదవుల భర్తీలో ప్రాధాన్యం ఇస్తామన్న హామీలు, భరోసాను కల్పించారు. ఈ నేపథ్యంలో భర్తీ ప్రకటన వెలువడడంతో వారిలో ఆశలు మొదలయ్యాయి. కాగా DCCB ఛైర్మన్ పదవిని పురన్ రెడ్డికి ఖరారు చేసినట్లు సమాచారం.

News February 20, 2026

జగిత్యాల: జీవన్ రెడ్డికి అస్వస్థత..!

image

కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను వెంటనే HYD KIMS ఆస్పత్రికి తరలించారు. కాగా, జీవన్ రెడ్డి నిన్న రాత్రి నుంచి వాంతులు, విరేచనాలు, జ్వరంతో బాధపడుతున్నారని, ఫుడ్ పాయిజన్‌తోనే ఇలా జరిగిందని కుటుంబీకులు తెలిపారు. ప్రస్తుతం జీవన్ రెడ్డి ఆరోగ్యంగానే ఉన్నారని, ఎవరూ ఆందోళన చెందొద్దని ఆయన వర్గీయులు పేర్కొన్నారు. మంత్రి లక్ష్మణ్ కాసేపట్లో జీవన్ రెడ్డిని పరామర్శించనున్నారు.