News March 21, 2025
తిరుపతి: ప్రైవేట్ స్కూళ్లపై ఫిర్యాదు

తిరుపతి జిల్లాలోని కొన్ని ప్రైవేట్ స్కూల్లో ఒంటిపూట బడులు నిర్వహించడం లేదని అఖిలపక్ష విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. ఈ మేరకు డీఈవో కేవీఎన్ కుమార్ శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఒంటిపూట బడులు పెట్టని స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఏపీ స్టూడెంట్స్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు హేమాద్రి యాదవ్, ప్రేమ్ కుమార్, లోకేశ్, యుగంధర్, ముని, సుకుమార్ పాల్గొన్నారు.
Similar News
News July 6, 2025
ఐఐఐటీకి తగ్గుతున్న వికారాబాద్ జిల్లా విద్యార్థుల సంఖ్య

వికారాబాద్ జిల్లా నుంచి ఐఐఐటీలో చేరే విద్యార్థుల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతోంది. ప్రభుత్వ, జడ్పీ, ఆదర్శ పాఠశాలల్లో పదో తరగతి అభ్యసించిన విద్యార్థుల మార్కుల ఆధారంగా బాసరలో అడ్మిషన్లు పొందుతున్నారు. గతేడాది VKB జిల్లా నుంచి 18 మంది ఐఐఐటీకి ఎంపికవగా.. ఈ ఏడాది కేవలం ఆరుగురు మాత్రమే ఎంపికవడం గమనార్హం. మహబూబ్‌నగర్ జిల్లాలో మరో ఐఐఐటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
News July 6, 2025
శ్రీకాకుళం జిల్లాలో యువకుడు దారుణ హత్య

కొత్తూరు మండలం వసప గ్రామ సమీపంలో అర్ధరాత్రి వేళ ఘోర సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన లుకలాపు మిన్నారావు (21) అనే యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు అతి దారుణంగా హత్య చేశారు. ఆదివారం ఉదయం మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న సీఐ చింతాడ ప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు.
News July 6, 2025
కన్నాయిగూడెం: మత్స్యకారుల వలకు చిక్కిన దెయ్యం చేప

కన్నాయిగూడెం మండలంలోని మత్స్యకారుల వలకు ఓ వింత చేప చిక్కింది. దీంతో జాలర్లు ఒక్కసారిగా అవాక్కయ్యారు. దెయ్యం చేపగా పిలుచుకునే ఈ చేప తినడానికి, ఔషధాల తయారీకి కూడా పనికిరాదని మత్స్యకారులు తెలిపారు. కాగా, ఈ చేప నదిలో, చెరువులో ఎక్కడున్నా మిగతా చేపలను, వాటి గుడ్లను తినడం వంటి లక్షణాలున్న ప్రమాదకరమైన చేప అన్నారు. ఈ చేపలు ఉన్నచోట మిగతా చేపలు కూడా ఎదుగుదల ఉండదని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు.