News May 11, 2024
తిరుపతి: ఫలితాలు విడుదల

శ్రీ పద్మావతి మహిళ యూనివర్సిటీలో (SPMVV) గత ఏడాది డిసెంబర్‌లో బిటెక్ (B.Tech) తృతీయ సంవత్సరం మొదటి సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదలైనట్లు పరీక్షల విభాగ నియంత్రణ అధికారిణి పేర్కొన్నారు. ఫలితాలను https://www.spmvv.ac.in/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.
Similar News
News December 31, 2025
చిత్తూరులో సెల్‌ఫోన్ దొంగల అరెస్ట్

చిత్తూరులో సెల్ ఫోన్లు చోరీచేసే ముగ్గురిని అరెస్టు చేసినట్లు రెండో పట్టణ సీఐ నెట్టికంటయ్య వెల్లడించారు. స్థానిక పీవీకేఎన్ కళాశాల వద్ద అనుమానంగా తిరుగుతున్న రాజేష్, లోకేశ్, రాకేశ్ అనే వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు. దొంగతనం చేసినట్లు నిర్ధారణ కావడంతో వారి నుంచి సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి చిత్తూరు జైలుకు తరలించారు.
News December 31, 2025
చిత్తూరు జిల్లాలో 74,447 ట్రాఫిక్ చలాన్లు

చిత్తూరు జిల్లాలో ఈసారి ట్రాఫిక్ చలాన్ల సంఖ్య భారీగా పెరిగింది. గతేడాది 54,454 చలాన్ల ద్వారా రూ.1.28 కోట్లు వసూలు చేయగా ఈసారి రూ.2.31 కోట్లు జరిమానా విధించారు. 2024లో 2519 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేయగా ఈసారి 2772 ఫైలయ్యాయి. మొత్తంగా జిల్లాలో గతేడాదితో పోలిస్తే ఈసారి ట్రాఫిక్ చలాన్ల ద్వారా రూ.కోటికి పైగా అదనంగా ఫైన్ వేశారు.
News December 31, 2025
చిత్తూరు: పింఛన్ల పంపిణీకి రూ.115 కోట్లు

చిత్తూరు జిల్లాలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ బుధవారం ఉదయం నుంచి మొదలైంది. జిల్లాలో 2,67,481 మందికి 27 రకాల పింఛన్లు ఇవ్వనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం జిల్లాకు రూ.115.17 కోట్లు విడుదల చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది లబ్ధిదారులకు పింఛన్లు అందిస్తారని పీడీ శ్రీదేవి తెలిపారు.


