News May 3, 2024

తిరుపతి: బస్సు ఢీకొని ముగ్గురి మృతి

image

తిరుపతి జిల్లాలో నిన్న ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏర్పేడు సీఐ శ్రీరామ శ్రీనివాస్ వివరాల మేరకు.. ముంబయికి చెందిన లలిత్ కుమార్ సింఘాల్(57) చెన్నైలో పని చేస్తున్నారు. తన భార్య అంజూ శింఘాల్‌తో కలిసి కారులో శ్రీకాళహస్తి వైపుకు వస్తుండగా మేర్లపాక వద్ద తమిళనాడు ఆర్టీసీ బస్సు ఢీకొంది. కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందగా భార్యాభర్తలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.

Similar News

News March 2, 2026

నేడు చిత్తూరు కలెక్టరేట్‌లో PGRS

image

చిత్తూరు కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం తెలిపారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కలెక్టరేట్‌లోని నూతన సమావేశపు మందిరంలో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలని ఆదేశించారు. ప్రజలు అర్జీలు అందించి సమస్యలను పరిష్కరించుకోవచ్చన్నారు.

News March 1, 2026

చౌడేపల్లి: చిరుత దాడిలో దూడ మృతి

image

చౌడేపల్లి మండలం ముదిరెడ్డిపల్లికి చెందిన రైతు గిరి తన పశువుల మేత కోసం గ్రామ సమీపంలో అటవీ ప్రాంతంలో తోలుకెళ్లాడు. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం పెద్ద వక్కిరి వద్ద పశువులు మేత మేస్తుండగా చిరుత దాడి చేసినట్లు రైతు తెలిపాడు. ఈ దాడిలో దూడ మృతి చెందినట్లు వాపోయాడు. చిరుత పులి దాడి నుంచి పశువులను కాపాడాలని రైతులు కోరుతున్నారు.

News March 1, 2026

PGRSను సద్వినియోగం చేసుకోండి: ఎస్పీ

image

చిత్తూరు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం ప్రజా సమస్యల ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు ఎస్పీ కార్యాలయం ఆదివారం వెల్లడించింది. ఉదయం10:30 గంటలకు పాత డీపీఓ కార్యాలయంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను జిల్లా స్థాయి పోలీస్ అధికారులకు నేరుగా తెలియజేసి సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. ఫిర్యాదుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వివరించారు.