News October 6, 2024
తిరుపతి: బాలికతో అసభ్యకర ప్రవర్తన

తిరుపతి రూరల్ పరిధిలో దారుణ ఘటన వెలుగు చూసింది. గూడూరు మండలానికి చెందిన ప్రసాద్(50) కొంతకాలంగా తిరుపతి(R)లో తాపీ మేస్త్రీగా పనిచేస్తున్నాడు. స్థానికంగా ఉంటున్న 3వ తరగతి బాలికకు ఫోనులో అశ్లీల చిత్రాలు చూపించి అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమె కేకలు వేయడంతో స్థానికులు చితకబాది MRపల్లి పోలీసులకు అప్పగించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
Similar News
News November 4, 2025
చిత్తూరు విద్యార్థులకు అరుదైన అవకాశం

చిత్తూరులోని ఉన్నత పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థులు N.లాస్య, M.రమాకాంత్‌కు అరుదైన అవకాశం దక్కింది. వీరిద్దరూ సైన్స్‌లో ప్రతిభ చూపడంతో “సైన్స్ ఎక్స్‌పోజర్ అండ్ ఎడ్యుకేషనల్ టూర్”కు సెలెక్ట్ చేశారు. ఇందులో భాగంగా నవంబర్ 6 నుంచి ఢిల్లీలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అక్కడి వివిధ కార్యాలయాలను చూపిస్తారు. పరిశోధనాసక్తి, దేశభక్తి పెంపొందించేలా టూర్ ఉంటుందని డీఈవో వరలక్ష్మి తెలిపారు.
News November 4, 2025
పుంగనూరులో విషాదం

గంటల వ్యవధిలో అన్నదమ్ములు మృతిచెందిన ఘటన పుంగనూరులో జరిగింది. పురుషోత్తం శెట్టి(75), రాధాకృష్ణయ్య శెట్టి(67) సోదరులు. పురుషోత్తం శెట్టికి పిల్లలు లేరు. వీరు ఉమ్మడిగా ఉంటూ బజారు వీధిలో కిరాణా షాపు నిర్వహిస్తున్నారు. నిన్న రాధాకృష్ణయ్య బాత్ రూములో జారి పడిపోయారు. సాయం చేయడానికి వెళ్లిన పురుషోత్తంశెట్టికి డోర్ తగిలి గాయపడ్డాడు. రాధాకృష్ణయ్య శెట్టి ఇంట్లో, పురుషోత్తంశెట్టి ఆసుపత్రిలో మృతిచెందాడు.
News November 4, 2025
చిత్తూరు: ఆసుపత్రిని ప్రారంభించిన మంత్రి

ఏపీఎస్ఆర్టీసీ సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన వైద్యశాల నూతన భవనాన్ని చిత్తూరులో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఆర్టీసీ సిబ్బందికి ఆసుపత్రి ఎంతగానో ఉపయోగపడుతుందని వెల్లడించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్, మురళీమోహన్, ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ నారాయణరావు, వైస్ చైర్మన్ మునిరత్నం పాల్గొన్నారు.


