News March 10, 2025
తిరుపతి: బీదకు ఎమ్మెల్సీ.. బీసీలపై బాబు ప్రేమకు నిదర్శనం

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా కావలికి చెందిన బీద రవిచంద్ర యాదవ్‌ను టీడీపీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది చంద్రబాబు బీసీలపై చూపుతున్న ప్రేమ, ఆప్యాయతలకు నిదర్శనమని తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం టీడీపీ బీసీ సెల్ అధ్యక్షుడు నెలవల ప్రసాద్, వేంపల్లి వెంకటేశ్వర్లు యాదవ్, ఇతర యాదవ సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News December 15, 2025
భారీ జీతంతో మేనేజర్ పోస్టులు

<
News December 15, 2025
రాకెట్ ఉమెన్ ఆఫ్ ఇండియా రీతు కరిధాల్

లక్నోలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన రీతు కరిధాల్ 1997లో ఇస్రోలో ఏరోస్పేస్ ఇంజినీర్‌గా చేరారు. ఇస్రో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులైన మార్స్ ఆర్బిటార్ మిషన్, మంగళ్‌యాన్ ప్రయోగాలకు డిప్యూటీ ఆపరేషన్స్ డైరెక్టర్‌గా పనిచేశారు. 2019లో ఇస్రో చేపట్టిన చంద్రయాన్-2కి మిషన్ డైరెక్టర్‌గా రీతూ బాధ్యతలు నిర్వర్తించారు. 2007లో నాటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా ఇస్రో యంగ్ సైంటిస్ట్ అవార్డు అందుకున్నారు.
News December 15, 2025
క్యాబేజీలో రెక్కల పురుగు నివారణకు సూచనలు

క్యాబేజీలో రెక్కల పురుగు లార్వాలు ఆకుల అడుగు భాగాన చేరి తినడం వల్ల ఆకులు వాడి ఎండిపోతాయి. వీటి ఉద్ధృతి ఎక్కువైతే ఆకులకు రంధ్రాలు పడి క్యాబేజీ పరిమాణం తగ్గుతుంది. దీని నివారణకు ప్రతి 25 క్యాబేజీ వరుసలకు 2 వరుసల ఆవ మొక్కలను ఎర పంటగా నాటాలి. రెక్కల పురుగు గుడ్లను నాశనం చేసేందుకు 5% వేపగింజల ద్రావణాన్ని, ఉద్ధృతి మరీ ఎక్కువైతే లీటరు నీటికి నోవాల్యురాన్1ml కలిపి కోతకు 15 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి.


