News December 30, 2025

తిరుపతి మధ్యలో బస్టాండ్ ఎందుకు…?

image

తిరుపతి బస్టాండ్‌‌ను రీమోడల్ చేయనున్నారు. ఇది సిటీ మధ్యలో ఉండటంతో ట్రాఫిక్ సమస్యలు పెరుగుతున్నాయి. భక్తులు, వైద్యం, విద్య, వాణిజ్య అవసరాల కోసం వచ్చే వారితో రద్దీ పెరుగుతోంది. గ్రేటర్ తిరుపతిని దృష్టిలో పెట్టుకుని లోకల్, తిరుమల బస్సులనే ప్రస్తుత బస్టాండ్ నుంచి నడపాలని ప్రజలు కోరుతున్నారు. సుదూర బస్సుల కోసం అవిలాల, అగ్రహారం, తిరుచానూరులో బస్టాండులు నిర్మించాలనే డిమాండ్ వినిపిస్తోంది.

Similar News

News January 5, 2026

పాలేరులో ‘షాడో’ మంత్రి పెత్తనం?

image

పాలేరులో మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇంచార్జ్ ‘షాడో మంత్రి’లా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన అధికారిక కార్యక్రమాల్లోనూ సొంత పెత్తనం సాగిస్తున్నారని చర్చ నడుస్తోంది. ఇది మంత్రి ఆదేశాలా లేక వ్యక్తిగత నిర్ణయాలా అని కేడర్ అయోమయంలో ఉంది. ఇన్‌ఛార్జ్ ఏకపక్ష వైఖరిపై సొంత పార్టీ నేతలే అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఈ పరిణామాలు నియోజకవర్గ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

News January 5, 2026

చిత్తూరు: లింగం మార్చి.. అమ్మాయి పక్క సీట్ బుక్ చేసి.!

image

ఇటీవల ఓ అమ్మాయి చిత్తూరు నుంచి బెంగళూరుకు RTC బస్సులో సీట్ బుక్ చేసుకుంది. ఆమె పక్క సీటులో అబ్బాయి ప్రత్యక్షం అయ్యాడు. ఆరా తీయగా మహిళ పేరుతో సీటు బుక్ చేసుకున్నట్లు తేలింది. సదరు అమ్మాయి తండ్రి కండక్టర్‌ను ప్రశ్నించగా నేనేమీ చేయలేనంటూ చేతులెత్తేశాడు. దీనిపై RTC అధికారులు విచారించారు. లింగ వివరాలు తప్పుగా ఉన్న టిక్కెట్లు చెల్లవని DPTO రాము స్పష్టం చేశారు. మీకు ఇలాంటి అనుభవం ఎదురైందా.?

News January 5, 2026

ఓయూ డిగ్రీ పరీక్షా తేదీలు వచ్చేశాయ్!

image

ఓయూ పరిధిలో జరిగే వివిధ డిగ్రీ కోర్సుల సెమిస్టర్ పరీక్షా తేదీలను విడుదల చేసినట్లు ఎగ్జామినేషన్ కంట్రోలర్ ప్రొ.శశికాంత్ తెలిపారు. BA, BSW, BCom, BSc, BBA రెగ్యులర్ కోర్సుల మొదటి సంవత్సరం ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలతో పాటు MA, MCom, MSc, MSW, MLIC, MJ& MC రెగ్యులర్ కోర్సుల 3వ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలిపారు.