News January 13, 2026
తిరుపతి: మళ్లీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను మారుస్తారా..?

తిరుపతి శిల్ప కళాశాల ప్రాంతంలో టౌన్‌షిప్ ఏర్పాటుకు టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఏడీ బిల్డింగ్ దగ్గరలోని టీటీడీ ప్రెస్ వద్ద స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి గత బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు అక్కడ కాదని టౌన్‌షిప్ ప్రతిపాదిత ఏరియాలో రూ.10 కోట్లతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ పనులు చేస్తున్నారు. ఇది పూర్తయి టౌన్‌షిప్‌కు అడ్డంగా మారితే.. స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను మళ్లీ మార్చేస్తారే అనే సందేహం నెలకొంది.
Similar News
News January 22, 2026
టీచర్లు చదువుకుంటామంటే అనుమతించడం లేదు: APTF

AP: 5 ఏళ్లు సర్వీసు పూర్తిచేసిన టీచర్ల ఉన్నత చదువులకు GOలో లేని నిబంధనలు పెడుతూ అనుమతించడం లేదని APTF విమర్శించింది. ‘140 మంది టీచర్లు దరఖాస్తు చేస్తే 100 మందిని డైరక్టరేట్ తిరస్కరించింది. ఇప్పటికే కొందరు కాలేజీల్లో ఫీజులూ కట్టారు. అయినా అధికారులు పెండింగ్‌లోఉంచారు’ అని సంఘం నేతలు హృదయరాజు, చిరంజీవి పేర్కొన్నారు. GO 342 ప్రకారం చదువుకోడానికి అవకాశం ఇవ్వాలని విద్యాశాఖ కార్యదర్శి శశిధర్‌ను కోరారు.
News January 22, 2026
విశాఖ: GCC నూతన ఎండీగా శోభిక బాధ్యతలు

విశాఖ గిరిజన సహకార సంస్థ (GCC) నూతన వైస్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎస్.ఎస్. శోభిక గురువారం బాధ్యతలు స్వీకరించారు. విధుల్లో చేరిన వెంటనే ఆమె అధికారులతో సమీక్ష నిర్వహించి, అరకు కాఫీ మార్కెటింగ్, గిరిజనుల జీవనోపాధి మెరుగుదలపై దృష్టి సారించాలని ఆదేశించారు. సంస్థ అభివృద్ధికి సిబ్బంది అంతా నిబద్ధతతో పనిచేయాలని కోరారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది ఆమెకు ఘనస్వాగతం పలికారు.
News January 22, 2026
EVM గోడౌన్ భద్రతలో అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

కలెక్టరేట్ ప్రాంగణంలోని EVM గోడౌన్ వద్ద పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశించారు. సాధారణ తనిఖీల్లో భాగంగా గురువారం కలెక్టరేట్ ప్రాంగణంలోని EVM గోడౌన్‌ను ఆయన తనిఖీ చేశారు. గోడౌన్ వద్ద ఉన్న భద్రతా చర్యలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. భద్రతా చర్యలు విషయంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు.


