News April 3, 2025

తిరుపతి మార్గంలో తప్పిన పెనుప్రమాదం

image

భాకరాపేట ఘాట్ రోడ్డులో బుధవారం మధ్యాహ్నం పెను ప్రమాదం తప్పింది. కొంత మంది ప్రయాణికులతో మదనపల్లె నుంచి ఆర్టీసీ బస్సు తిరుపతికి బయల్దేరింది. ఘాట్ రోడ్డులోకి రాగానే బస్ బ్రేక్‌లు ఫెయిలయ్యాయి. గమనించిన డ్రైవర్ ప్రయాణికులను అలర్ట్ చేశారు. ఆ తర్వాత చాకచక్యంగా రోడ్డు పక్కన ఉన్న కొండను ఢీకొట్టారు. కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రాణనష్టం తప్పింది.

Similar News

News April 4, 2025

అమ్మవారి సేవలో చిత్తూరు SP

image

నగరి గ్రామదేవత శ్రీ దేశమ్మ తల్లిని గురువారం చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ మేరకు ఆలయ అధికారులు వారికి పూర్ణకుంభతో స్వాగతం పనికి అమ్మవారి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందించారు.

News April 4, 2025

ఆలయాల అభివృద్ధికి 15 రోజుల్లో ప్రతిపాదనలు: కలెక్టర్

image

కుప్పం నియోజకవర్గంలో 11 దేవాలయాల అభివృద్ధికి సంబంధించి 15 రోజుల్లో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు. దేవాలయాల అభివృద్ధికి సంబంధించి ఇది వరకే ప్రభుత్వం నిధులను మంజూరు చేయడం జరిగిందన్నారు. అధికారులు త్వరగా ప్రతిపాదనలు పంపాలని ఆయన కోరారు. 

News April 3, 2025

చిత్తూరు: తండ్రిని చంపిన కుమారుడు

image

తండ్రిని కుమారుడే హత్య చేసిన ఘటన చిత్తూరు జిల్లాలో గురువారం వెలుగు చూసింది. SRపురం మండలం ఆర్ఆర్ పురానికి చెందిన శ్రీనివాసులు మద్యానికి బానిసై తరచూ భార్యను వేధిస్తున్నాడు. కొన్ని సందర్భాల్లో తల్లిని కొట్టేవాడు. ఇదే విషయమై తండ్రితో కుమారుడు నాగరాజు గొడవ పడ్డాడు. ఈక్రమంలో తండ్రి తలపై గట్టిగా కొట్టడంతో ఆయన చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

error: Content is protected !!