News December 21, 2025
తిరుపతి: మీ వాట్సప్‌కు ఈ మెసేజ్ వచ్చిందా.?

వాట్సాప్ ‘ఘోస్ట్ పేయిరింగ్’ స్కామ్‌పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని SP సుబ్బరాయుడు తెలిపారు. హాయ్.. మీ ఫోటో చూశారా?”, “ఇది నువ్వేనా?” వంటి సందేశాల్లోని లింకులను క్లిక్ చేయవద్దని హెచ్చరించారు. ఇవి ‘ఘోస్ట్ పేయిరింగ్’ స్కామ్‌కు సంబంధించినవని, లింక్ ఓపెన్ చేస్తే వాట్సాప్ ఖాతా హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందన్నారు. అనుమానం వచ్చిన వెంటనే సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
Similar News
News December 29, 2025
వివక్షపై భారతీయుడి పోరాటం.. అహంకారానికి ₹81 లక్షల గుణపాఠం

బ్రిటన్‌లోని ఓ KFC అవుట్‌లెట్‌లో పనిచేసే తమిళనాడు యువకుడు మాధేశ్ రవిచంద్రన్ జాతి వివక్షపై కోర్టులో పోరాడి గెలిచాడు. కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ప్రకారం మాధేశ్‌ను శ్రీలంక తమిళుడైన తన మేనేజర్ ‘బానిస’ ‘భారతీయులంతా మోసగాళ్లు’ అని అవమానించేవాడు. తట్టుకోలేక మాధేశ్ ఉద్యోగానికి రాజీనామా చేసి కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం సుమారు ₹81 లక్షల పరిహారం చెల్లించాలని మేనేజర్‌ను ఆదేశించింది.
News December 29, 2025
మదనపల్లె జిల్లానే.. కానీ పేరు అన్నమయ్య!

మదనపల్లె జిల్లాలో కొత్త ట్విస్ట్ నెలకొన్నట్లు సమాచారం. రాజంపేటను కడపలో, రైల్వేకోడూరును తిరుపతిలో కలపడంతో అన్నమయ్య జిల్లా రద్దు అవుతుందని అందరూ భావించారు. రాయచోటిని కొత్తగా ఏర్పడే మదనపల్లె జిల్లా(మందు అనుకున్న పేరు)లో కలుపుతారు. మదనపల్లె కేంద్రంగానే అన్నమయ్య జిల్లా పేరును కొనసాగించాలని నిన్నటి సమావేశంలో సీఎంతో చర్చించినట్లు సమాచారం. నేటి కేబినెట్ మీటింగ్ తర్వాత దీనిపై స్పష్టత రానుంది.
News December 29, 2025
పాలమూరు: అసెంబ్లీలో రేవంత్ Vs కేసీఆర్.. ప్రాజెక్టులపై సవాల్!

రాష్ట్ర అసెంబ్లీలో నేడు రసవత్తర చర్చకు రంగం సిద్ధమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభకు హాజరుకానున్నట్లు సమాచారం. ముఖ్యంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, నదీ జలాల విషయాలపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగే అవకాశం ఉంది. కేసీఆర్ లేవనెత్తే అంశాలకు సీఎం రేవంత్ రెడ్డి ఏ విధంగా బదులిస్తారనేది రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.


