News December 10, 2024

తిరుపతి: యువతి మృతి.. అసలేం జరిగింది?

image

చంద్రగిరి(M) ముంగిలిపట్టు వద్ద నిన్న <<14835672>>చనిపోయిన <<>>యువతి పాకాల(M) వడ్డేపల్లికి చెందిన శ్రావణి(23)గా గుర్తించారు. తిరుపతిలో పనిచేసే ఆమెకు పూతలపట్టు(M) కమ్మవాండ్లపల్లె కార్తీక్‌తో పరిచయం ఉంది. ఇద్దరూ బైకుపై తిరుపతి నుంచి ముంగిలిపట్టుకు వచ్చారు. సాయంత్రం అమ్మాయి ఏడుస్తుండగా స్థానికులు గమనించారు. ఆ తర్వాత ఆమెను కార్తీక్ ఏమైనా చేశాడా? రోడ్డు దాటుతుంటే వాహనం ఢీకొని చనిపోయిందా? అనేది తెలియాల్సి ఉంది.

Similar News

News January 6, 2026

చిత్తూరు జిల్లాలో తగ్గిన పంచాయతీలు

image

పునర్విభజన కారణంగా చిత్తూరు జిల్లాలో పంచాయతీల సంఖ్య భారీగా తగ్గిపోయింది. 696 పంచాయతీలున్న జిల్లాలో తాజాగా ఆ సంఖ్య 621కి తగ్గింది.75 గ్రామ పంచాయతీలు కొత్తగా ఏర్పడిన అన్నమయ్య జిల్లాకు వెళ్లాయి. పుంగనూరు నియోజకవర్గంలోని పుంగనూరు, చౌడేపల్లె, సదుం మండలాలను మదనపల్లె జిల్లాలో కలపడంతో 32గా ఉన్న మండలాల సంఖ్య 28కి తగ్గింది.

News January 6, 2026

చిత్తూరుకు పునర్విభజన ఎఫెక్ట్.. తగ్గిన గ్రామ పంచాయతీలు

image

చిత్తూరు జిల్లాకు పునర్విభజన పుణ్యమా అంటూ గ్రామ పంచాయతీలు తగ్గాయి. 696 గ్రామ పంచాయతీలు ఉన్న జిల్లా పునర్విభజన అనంతరం 75 గ్రామ పంచాయతీలు నూతనంగా ఏర్పాటైన అన్నమయ్య మదనపల్లి జిల్లాలో కలిసిపోయాయి. దీంతో 621 గ్రామ పంచాయతీలకు చిత్తూరు జిల్లా పరిమితమైంది. ఇక మండలాల వారీగా పుంగునూరు, చౌడేపల్లి, సదుం మండలాలు మదనపల్లిలో కలవడంతో 32 ఉన్న మండలాలు 28 కి మాత్రమే పరిమితమైంది. దీంతో చిత్తూరు చిన్నదైంది.

News January 6, 2026

వి కోట: వివాహిత అనుమానాస్పద మృతి

image

వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి మృతి చెందిన ఘటన వీకోట మండలంలో వెలుగు చూసింది. అంబేడ్కర్ నగర్‌కు చెందిన వినోద్ కుమార్ భార్య మేఘన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా ఆమె అప్పటికే మృతి చెందారు. మృతురాలు బంధువులు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.