News February 2, 2026
తిరుపతి: రెండో రోజు 179 మంది గైర్హాజరు

ఇంటర్మీడియట్ జనరల్ ప్రాక్టికల్ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా జరిగినట్లు RIO రాజశేఖర్ రెడ్డి తెలిపారు. రెండో రోజు 90 పరీక్ష కేంద్రాల్లో జరిగిన పరీక్షలకు ఉదయం 5275 మందికి గాను 98 మంది గైర్హాజరై 5177 మంది హాజరయ్యారు. అదేవిధంగా మధ్యాహ్నం 4661 మందికి 81 మంది గైర్హాజరు కాగా 4580 మంది పరీక్షలు రాశారు. ఈనెల 10 వరకు ఓకేషనల్ ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి.
Similar News
News March 2, 2026
ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు ఎల్లుండి సెలవు

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు ఈనెల 4న సెలవు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ శాఖ అధికారులు తెలిపారు. హోలీ పండుగ సందర్భంగా బుధవారం మార్కెట్లో క్రయవిక్రయాలు జరగవని చెప్పారు. తిరిగి ఈనెల 5 నుంచి యథావిధిగా జరుగుతాయని అన్నారు. ఈ విషయాన్ని జిల్లా రైతు సోదరులు గమనించాలని సూచించారు. రేపు మార్కెట్ ఉంటుందని, సెలవు అంటూ జరిగే ప్రచారాన్ని నమ్మవద్దని పేర్కొన్నారు.
News March 2, 2026
ముగిసిన తరాలపల్లి ఉద్యమ ప్రస్థానం!

తరాలపల్లి వాసులు ఉద్యమ బాట ఎంచుకొని దశాబ్దాల పాటు అడవి జీవితం గడిపారు. కాజీపేట మండల పరిధిలోని ఈ గ్రామంలో దశాబ్దాల తరబడి దళంలో కీలకంగా పనిచేశారు. దళ సభ్యుల హోదా నుంచి కీలకమైన పదవుల వరకు ఎదిగిన నేతలంతా ఎన్కౌంటర్లలో మృతి చెందారు. గతంలో ఏడుగురు ఎన్ కౌంటర్ కాగా ఆపరేషన్ కగార్‌లో గతేడాది అంకేశ్వరపు సారయ్య హతమయ్యారు. తాజాగా కీలక నేత ముప్పిడి సాంబయ్య లొంగుబాటుతో ఆ గ్రామ ఉద్యమ ప్రస్థానం ముగిసింది.
News March 2, 2026
గల్ఫ్‌లో ఉన్నవాళ్లు భారత్ రావాలంటే?

యుద్ధ పరిస్థితులతో గల్ఫ్ దేశాల్లోని ప్రవాస భారతీయుల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. INDకు తిరిగి రావాలనుకునేవారికి ఒకేఒక్క ఆప్షన్ ఉంది. అదే ఒమన్ మీదుగా IND చేరుకోవడం. ఆ దేశంపై ఇరాన్ దాడి చేయడం లేదు. దీంతో భారతీయులను రోడ్డు మార్గంలో ఒమన్‌కు తీసుకొచ్చి అక్కడి నుంచి స్వదేశానికి రప్పించేలా చర్చలు జరిపినట్లు కేంద్రమంత్రి బండి సంజయ్ తెలిపారు. దుబాయ్ నుంచి ఒమన్ రాజధాని మస్కట్‌కు బైరోడ్ 450km ప్రయాణించాలి.


