News February 8, 2026
తిరుపతి: ‘రేపు జరగబోయే పీజీఆర్ఎస్ కార్యక్రమం రద్దు’

సోమవారం జరగాల్సిన PGRS కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. జిల్లా, డివిజన్, మండల, గ్రామ, వార్డు సచివాలయ స్థాయి సిబ్బంది సమీక్షలో పాల్గొననున్నందున రద్దు చేశామన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కలెక్టర్ కోరారు.సీఎం చంద్రబాబు సచివాలయంలో నిర్వహించే సమీక్షకు జిల్లా నుంచి గ్రామ స్థాయి వరకు అధికారులు వర్చువల్‌గా హాజరవుతున్నందున రద్దు చేసినట్లు తెలిపారు.
Similar News
News February 27, 2026
తాగునీటి ఎద్దడి రాకుండా చూడాలి: కలెక్టర్ ప్రావీణ్య

రాబోయే వేసవి కాలంలో జిల్లాలో తాగునీటి ఎద్దడి కలగకుండా చూడాలని అధికారులను కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్లు, ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి, గ్రామాల్లో నీటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
News February 27, 2026
HYD: Gen Z తెలివి.. ‘చెత్త’ నుంచి డబ్బు!

HYD యువతలో ఇప్పుడు ‘అప్‌సైక్లింగ్’ ఒక మతంలా మారుతోంది. మురికివాడల్లో పారేసిన టైర్లు, విరిగిన ప్లాస్టిక్ డబ్బాలను సేకరించి వాటిని లగ్జరీ ఫర్నీచర్‌గా మార్చి ఆన్‌లైన్‌లో అమ్ముతున్నారు. ఇది కేవలం వ్యాపారం కాదు.. పర్యావరణం మీద వారికున్న ‘యూనిక్’ ప్రేమ. పాత సామన్ల మార్కెట్ (జుమ్మెరాత్ బజార్) వీరి పాలిట ఇప్పుడు ఒక ఐడియా బ్యాంక్. వ్యర్థాలను అర్థాలుగా మార్చుతున్న ఈ Gen Z తెలివితేటలు అమోఘం.
News February 27, 2026
చెరువుల పరిరక్షణపై అధికారులకు కలెక్టర్ ఆదేశం..!!

నిర్మల్ జిల్లాలోని చెరువులను పకడ్బందీగా పరిరక్షించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో లేక్ ప్రొటెక్షన్ కమిటీ సమీక్ష నిర్వహించారు. చెరువు గట్లను బలోపేతం చేయాలని, కబ్జాలకు గురైతే తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు జాయింట్ సర్వే చేసి సరిహద్దులు గుర్తించాలన్నారు. గట్లపై మొక్కలు పెంచాలని చెప్పారు. అడిషనల్ కలెక్టర్ కిషోర్ పాల్గొన్నారు.


