News September 3, 2024
తిరుపతి: రేపు JRF పోస్ట్‌కు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు
రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ (RARS) నందు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF) పోస్ట్‌కు బుధవారం వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. ఎమ్మెస్సీ అగ్రికల్చర్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. మరిన్ని వివరాలకు https://angrau.ac.in/ANGRU/Recruitment_Notification_2021.aspx వెబ్ సైట్ చూడాలని సూచించారు.
Similar News
News January 10, 2025
కొండంత జనం
తిరుమలలో శుక్రవారం వేకువజాము నుంచే వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా ప్రారంభం అయ్యాయి. లక్షల సంఖ్యలో వచ్చిన భక్తులతో శ్రీవారి ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి. వీఐపీలతో పాటూ సాధారణ భక్తులు తిరుమల వేంకన్నను ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసుకున్నారు. నారాయణుడి నామస్మరణతో తిరుమల ప్రాంగణం మార్మోగింది. స్వామి వారి స్వర్ణ రథోత్సవం సందర్భంగా తీసిన ఫొటోలు అబ్బుర పరుస్తున్నాయి.
News January 10, 2025
ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించండి
గురువారం నగరపాలక సంస్థ పరిధిలో 49వ వార్డు సచివాలయాన్ని అనంతపురం రీజినల్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పి.విశ్వనాథ్ తనిఖీ చేశారు. వార్డు పరిధిలో పన్నుల వసూళ్లపై సమీక్షించారు. వార్డు సచివాలయంలో కార్యదర్శులు హాజరు నమోదు, మూవ్మెంట్ రిజిస్టర్, పబ్లిక్ సర్వీసెస్ రిజిస్టర్లను తనిఖీ చేశారు. వార్డు సచివాలయానికి వచ్చే ప్రజలతో సామరస్యంగా మాట్లాడి వారి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు.
News January 9, 2025
తిరుపతికి కీలక నేతల రాక
మాజీ సీఎం జగన్ ఇవాళ తిరుపతి రానున్నారు. సాయంత్రం 4 గంటలకు నగరానికి చేరుకుంటారు. స్విమ్స్ ఆసుపత్రిలో బాధితులను ఆయన పరామర్శిస్తారని వైసీపీ వర్గాలు పేర్కొన్నాయి. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు పవన్ కళ్యాణ్, 4 గంటలకు నారా లోకేశ్ సైతం తిరుపతి వస్తారని సమాచారం. ఇప్పటికే సీఎం చంద్రబాబు అమరావతి నుంచి తిరుపతికి బయల్దేరారు. మరికాసేపట్లోనే రుయాలో బాధితులను పరామర్శిస్తారు.