News October 20, 2025
తిరుపతి రైల్వే స్టేషన్‌లో నకిలీ టీటీ.!

తిరుపతి రైల్వే స్టేషన్‌లో టికెట్ పరిశీలకుడిగా నటిస్తూ టికెట్ లేని ప్రయాణికులను మోసంచేసి డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తిని రైల్వే భద్రతాదళం, GRP పోలీసులు సంయుక్తంగా కలిసి పట్టుకున్నారు. రైల్వే సిబ్బంది గేట్ నంబర్ 3 వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు వాగ్వాదం చేసుకోవడం గమనించారు. చెకింగ్ ఇన్స్పెక్టర్ అనిచెప్పి రూ.1000 అడుగుతుండగా నకిలీ వ్యక్తిని వారు పట్టుకున్నారు.
Similar News
News October 21, 2025
155% టారిఫ్స్ విధిస్తా.. చైనాకు ట్రంప్ వార్నింగ్

చైనాపై 155% సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ‘సుంకాల రూపంలో చైనా నుంచి మనకు అపారమైన డబ్బు వస్తోంది. ప్రస్తుతం 55% చెల్లిస్తోంది. మనతో ఒప్పందం కుదుర్చుకోకపోతే నవంబర్ 1 నుంచి 155% చెల్లించాల్సి రావచ్చు’ అని హెచ్చరించారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్‌తో ద్వైపాక్షిక చర్చలకు ముందు ఆయన మాట్లాడారు. చైనా ప్రెసిడెంట్ జిన్‌పింగ్‌ను సౌత్ కొరియాలో కలవనున్నట్లు వెల్లడించారు.
News October 21, 2025
వరుసగా 4 వికెట్లు.. ఉత్కంఠ పోరులో శ్రీలంక విజయం

ఉమెన్స్ వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచులో శ్రీలంక 7 రన్స్ తేడాతో విజయం సాధించింది. బంగ్లాదేశ్‌కు గెలిచే అవకాశం ఉన్నా చివర్లో 2 పరుగుల వ్యవధిలో 5 వికెట్లు కోల్పోయింది. చివరి ఓవర్లో 9 పరుగులు చేయాల్సి ఉండగా, తొలి 4 బంతుల్లో వరుసగా 4 వికెట్లు పడ్డాయి. దీంతో SLకు ఊహించని విజయం దక్కింది. అంతకుముందు శ్రీలంక 202 పరుగులకు ఆలౌటైంది. ఈ ఓటమితో WC నుంచి ఎలిమినేట్ అయిన తొలి జట్టుగా BAN నిలిచింది.
News October 20, 2025
MBNR జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

@మహబూబ్ నగర్ జిల్లాలో ఘనంగా దీపావళి సంబరాలు.
@రాజాపూర్ మండలం ముదిరెడ్డిపల్లిలో టిప్పర్ ఢీకొని.. లారీ డ్రైవర్ మృతి.
@కౌకుంట్లలో ముగిసిన సదర్ ఉత్సవాలు.
@జడ్చర్లలో పిచ్చికుక్కల దాడి.. చిన్నారులకు గాయాలు.
@జాతీయస్థాయి SGF అండర్-17 వాలీబాల్ పోటీలకు నవాబుపేట యన్మంగండ్ల చెందిన జైనుద్దీన్ ఎంపిక.
@కురుమూర్తి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం
@మిడ్జిల్ రోడ్డు ప్రమాదం ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు.