News February 6, 2025
తిరుపతి: రోడ్డు ప్రమాదంలో అన్నాచెల్లెళ్ల మృతి
చిత్తూరు జిల్లా విజయపురం మండల తెల్లగుంట గ్రామ సమీపంలో అన్నాచెల్లెలు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. బంధువుల సమాచారం మేరకు.. నిండ్ర మండలం అగరం పేట గ్రామానికి చెందిన రవి(48), KVB.పురం మండలం కళత్తూరు గ్రామానికి చెందిన మంజుల (44)అన్నా చెల్లెలు. వారు ఇద్దరు కలిసి పెద్ద అక్క దేశమ్మ ఇంటికి వెళ్లి తిరిగి ప్రయాణంలో తెల్లగుంట వద్ద లారీ ఢీకొని మృతి చెందారు. ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News February 6, 2025
ప్రకాశం: ఒకే రోజు ముగ్గురు మృతి
ప్రకాశం జిల్లాలో బుధవారం వివిధ ఘటనలలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. పొదిలి మండలం కంబలపాడు కి చెందిన సుబ్బరత్తమ్మ పొలంలో విద్యుత్ షాక్‌కి గురై మరణించారు. దర్శి మండలానికి చెందిన నారాయణమ్మ పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ మరణించారు. అలాగే వరికుంటపాడు నుంచి పామూరు వస్తున్న బాలయ్య అనే వ్యక్తి గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందారు.
News February 6, 2025
బంగ్లా పితామహుడి ఇంటికి నిప్పు
బంగ్లాదేశ్ పితామహుడిగా పేరొందిన షేక్ ముజిబుర్ రెహమాన్ ఇంటిని బంగ్లా ఆందోళనకారులు ధ్వంసం చేశారు. ఇంటిపై దాడి చేసి నిప్పు పెట్టారు. దేశంలోని తమ అవామీ లీగ్ కార్యకర్తలందరూ ఏకమై మహ్మద్ యూనస్ మధ్యంతర సర్కారుపై తిరగబడాలని మాజీ ప్రధాని హసీనా ఆన్‌లైన్ వీడియోలో పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆమె తండ్రి, బంగబంధు రెహమాన్ భవనాన్ని ఆందోళనకారులు ధ్వంసం చేశారు.
News February 6, 2025
రాజన్న సిరిసిల్ల: మహిళ ఫొటోలు, వీడియోలు తీసిన వ్యక్తి అరెస్ట్..
స్నానం చేస్తుండగా మహిళ ఫొటోలు, వీడియోలు చిత్రీకరించిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు కోనరావుపేట ఎస్ఐ ప్రశాంత్ రెడ్డి తెలిపారు. సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని కనగర్తి గ్రామానికి చెందిన బత్తుల అంజయ్య ఓ మహిళ స్నానం చేస్తుండగా తన సెల్ ఫోన్‌లో ఫొటోలు, వీడియోలు తీశాడని బాధిత మహిళ పీఎస్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మహిళా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.