News July 11, 2024
తిరుపతి లాయర్‌కు స్టేట్ 5th ర్యాంక్

వారిది సాధారణ రైతు కుటుంబం. చిన్నప్పుడే తండ్రి మృతి చెందాడు. తల్లి, సోదరుడి ప్రోత్సహంతో మనుషా రాష్ట్ర స్థాయి PG లాసెట్‌లో ఐదో ర్యాంకు సాధించింది. పొదలకూరు(M) లింగంపల్లి గ్రామానికి చెందిన గుండ్రా మస్తాన్‌రెడ్డి, మాధవిల కుమార్తె పదో తరగతి వరకు పొదలకూరు బాలికల ZP హైస్కూల్లో చదివింది. తిరుపతి SVUలో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి ఇక్కడే న్యాయవాదిగా పనిచేస్తోంది. న్యాయమూర్తి కావడమే లక్ష్యమని మనుషా పేర్కొంది.
Similar News
News February 21, 2026
పలమనేరు: APO సస్పెండ్.. అసిస్టెంట్లకు నోటీసులు..!

పలమనేరు ఉపాధి హామీ పనుల్లో <<19204298>>అవినీతి<<>> జరిగిందని ప్రాథమికంగా గుర్తించిన అధికారులు APO రవికుమార్‌ను సస్పెండ్ చేశారు. అసిస్టెంట్‌లకు షోకాస్ నోటీసులను జారీ చేశారు. ఇదే అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేసి, FIR నమోదు చేసినట్లు సమాచారం. సమగ్ర విచారణ అనంతరం.. ఈ అంశంలో ఎంత మేర ప్రభుత్వ నిధులు ప్రజలకు అందకుండా స్వాహా చేశారో తేలనుంది.
News February 21, 2026
ZP ఛైర్మన్ ఫిర్యాదుతో విషయం బయటకు..!

అధికార పార్టీ నేతల అండదండలతో పలమనేరులో ఉపాధి హామీ పనుల్లో భారీ <<19204272>>అవకతవకలు<<>> జరిగాయని చిత్తూరు ZP ఛైర్మన్ కలెక్టర్ సుమిత్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. వేజెస్ రూపంలో అందించే నగదును ఏపీఓ, అసిస్టెంట్లు తమ సొంత అకౌంట్లకు బదిలీ చేసుకుంటున్నారని అందులో పేర్కొన్నారు. దీంతో ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, నివేదికను సమర్పించాలని డ్వామా పీడీకి కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
News February 21, 2026
పలమనేరు: నకిలీ బిల్లుల సృష్టి కర్తలు వీళ్లే..!

<<19204252>>నకిలీ బిల్లుల<<>> వ్యవహారంలో APO రవికుమార్, టెక్నికల్ అసిస్టెంట్ ఉషశ్రీ, ఫీల్డ్ అసిస్టెంట్ ఉదయ్ కుమార్ కీలకంగా వ్యవహరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పలమనేరులోని అంబేడ్కర్ నగర్ బసాపురం పోస్టాఫీస్‌లో వారం రోజుల వ్యవధిలో 100కు పైగా అకౌంట్లు ఓపెన్ చేశారని ప్రాథమిక సమాచారం. ముందు చేసిన పనులకు బిల్లు పెట్టినట్లు కొన్ని, డమ్మీ మస్టర్ క్రింద మరి కొన్ని బిల్లులు పెట్టినట్లు సమాచారం.


