News February 14, 2025
తిరుపతి: లోకేశ్‌ను కలిసిన రాకేశ్ కుటుంబ సభ్యులు

ఏనుగుల దాడిలో మృతి చెందిన తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కందులవారిపల్లె ఉపసర్పంచ్ రాకేశ్ చౌదరి కుటుంబ సభ్యులు శుక్రవారం ఉండవల్లిలో మంత్రి నారా లోకేశ్‌ను కలిశారు. ఈ సందర్భంగా లోకేశ్ వారితో మాట్లాడుతూ.. ఏనుగుల దాడిలో రాకేశ్ మరణించడం దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని వ్యాఖ్యానించారు. మృతుడి కుటుంబానికి అన్నివిధాల అండగా ఉంటానని లోకేశ్ హామీ ఇచ్చారు.
Similar News
News February 20, 2026
చిన్నారుల్లో హెయిర్ ఫాల్

ప్రస్తుతకాలంలో హెయిర్ ఫాల్ అందర్నీ ఇబ్బంది పెడుతోంది. ముఖ్యంగా చిన్నారుల్లో కూడా ఈ సమస్య పెరుగుతోందంటున్నారు నిపుణులు. పిల్లల్లో జుట్టు రాలడానికి ప్రధాన కారణం పౌష్టికాహార లోపం. పిల్లలకు ఐరన్, జింక్, ప్రొటీన్లు పుష్కలంగా అందేలా డైట్ మార్చాలి. జుట్టును గట్టిగా లాగి దువ్వడం, బిగించడం వల్ల కూడా జుట్టు రాలొచ్చు. కొంతమంది పిల్లల్లో జ్వరాలు వచ్చి తగ్గిన తర్వాత కూడా హెయిర్ లాస్ ఎక్కువగా ఉంటుంది.
News February 20, 2026
నెల్లూరు- బద్వేల్ గ్రీన్ ఫీల్డ్ హైవేకు వేగంగా అడుగులు..!

రాయలసీమ, నెల్లూరు జిల్లాల పారిశ్రామికీకరణలో కీలకమైన గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణంలో అడుగులు వేగంగా పడుతున్నాయి. మనుబోలు మండలంలోని కృష్ణపట్నం పోర్టు రోడ్డు నుంచి కడప జిల్లా బద్వేల్ వరకూ నిర్మించ తలపెట్టిన భారీ ప్రాజెక్ట్‌కు తాజాగా కేంద్ర ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించింది. మనుబోలు, పొదలకూరు, చేజర్ల, అనంతసాగరం, మర్రిపాడు మండలాల మీదుగా ఈ రోడ్డు నిర్మాణం జరగనుంది.
News February 20, 2026
బందరులో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

బందరులోని కేంద్రీయ విద్యాలయంలో బోధన, బోధనేతర పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు ప్రిన్సిపల్ మహ్మద్ ఆసిఫ్ హుస్సేన్ తెలిపారు. ఈనెల 23న ఇంగ్లీషు, హిందీ, గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్ సైన్స్, PGT పోస్టులకు మౌఖిక పరీక్షలు నిర్వహిస్తారు. 24న కంప్యూటర్ ఆపరేటర్, వృత్తి ఉపాధ్యాయుడు, క్రీడల కోచ్, కౌన్సిలర్, స్పెషల్ ఎడ్యుకేటర్, నర్సు పోస్టులకు ఇంటర్వ్యూ ఉంటుందన్నారు.


