News November 14, 2024

తిరుపతి వద్ద ఘోర ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్

image

తిరుపతి రూరల్ (మం) వేదాంతపురం నేషనల్ హైవేపై అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బంధువుల గృహ ప్రవేశం కోసం బెంగళూరు నుంచి కారులో వస్తుండగా వారిని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో తిరుపతి రుయాకు తరలించగా, పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News December 27, 2025

చిత్తూరు: రోడ్డు ప్రమాదంలో తల్లి, కుమారుడి మృతి

image

ఈ విషాద ఘటన చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలంలో జరిగింది. తిరుపతి-బెంగళూరు హైవేపై వెళ్తున్న కారు కె.పట్నం బ్రిడ్జి వద్ద గురువారం సాయంత్రం లారీని ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించింది. ఈక్రమంలో అదుపు తప్పి లారీని వెనుక వైపు నుంచి కారు ఢీకొట్టింది. కారులో ఉన్న కోమల(40), ఆమె కుమారుడు వర్ధన్ గౌడ్(11) తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రికి తరలించగా చనిపోయారు. మృతదేహాలను శుక్రవారం బంధువులకు అప్పగించారు.

News December 26, 2025

చిత్తూరు: ఉపాధి రికవరీ బకాయిలు రూ. 1.59 కోట్లు

image

చిత్తూరు జిల్లాలో ఉపాధి హామీ పథకంలో సోషల్ ఆడిట్ తనిఖీ రికవరీలో ఇంకా రూ. 1.59 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. ఐదేళ్లలో సోషల్ ఆడిట్లో రూ. 4.85 కోట్ల మేర అవినీతి జరిగినట్టు అధికారులు గుర్తించారు. దీనిని రికవరీ చేయాలని ఆదేశించగా ఇప్పటివరకు రూ. 3.26 కోట్లను వసూలు చేశారు. రికవరీకి చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.

News December 25, 2025

క్రీస్తు లోక రక్షకుడు: చిత్తూరు కలెక్టర్

image

చిత్తూరులోని లక్ష్మీనగర్ కాలనీలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. బీట్టీ మెమోరియల్ చర్చ్‌లో రేవ శామ్వేల్ ఆర్థర్ అధ్యక్షతన ప్రార్థనలు చేశారు. ఈ వేడుకలకు కలెక్టర్ సుమిత్ కుమార్ కుటుంబ సభ్యులతో కలసి హాజరయ్యారు. లోక రక్షకుడైన క్రీస్తు జన్మదిన వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని చెప్పారు. క్రీస్తు లోక రక్షకుడని, ఆయన జననం లోకానికి సమాధానమని తెలిపారు.