News October 21, 2025
తిరుపతి: వలస నేతలతో కలిసి ఉండలేకున్నారు..!

తిరుపతిలో కొందరు వైసీపీ కార్పొరేటర్లు, నాయకులు టీడీపీ, జనసేనలో చేరారు. డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ సైతం కూటమికి జైకొట్టారు. అయినప్పటికీ.. ‘నారాయణ నగదు వసూళ్ల దందా చేస్తున్నారు’ అని టీడీపీ నాయకులే ఆయనను విమర్శిస్తున్నారు. వైసీపీలో అంతా తామై వ్యహరించామని.. ఇప్పుడు కూటమిలో ఉంటూ ఆ పార్టీ నేతల నుంచే విమర్శలు ఎదురు కావడంతో వారంతా షాక్‌కు గురవుతున్నారు. కూటమి పార్టీలతో ఇమడలేక లోలోన మదనపడుతున్నారంట.
Similar News
News October 21, 2025
REWIND 2023 పోల్.. జూబ్లీహిల్స్‌లో 1,374 మంది నోటాకు ఓటేశారు!

2023 డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోటీ చేసిన 19 మందిని 1,374 మంది ఓటర్లు తిరస్కరించారు. అంటే వీరంతా NOTA (None of The Above)కు ఓటు వేశారన్న మాట. ఇదిలా ఉండగా వెయ్యి ఓట్లలోపు ఇద్దరు అభ్యర్థులు సాధించగా 500లోపు ఇద్దరు, 200లోపు ఆరుగురు, ఐదుగురు 100లోపు ఓట్లు సాధించారు. ఆనందరావు అనే ఇండిపెండెంట్ అభ్యర్థి 53 ఓట్లతో చివరి స్థానంలో నిలిచారు.
News October 21, 2025
అన్నమయ్య జిల్లాలో భారీ వర్షాలు.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు

అన్నమయ్య జిల్లాలో ఇవాళ భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. దీంతో ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ సూచించారు. అలాగే కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఎక్కడైనా సమస్యలు ఏర్పడితే 08561-293006 నంబర్‌కు సమాచారం ఇవ్వాలన్నారు. కంట్రోల్ రూమ్‌లో 24 గంటలు సిబ్బంది ఉండేలా ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు.
News October 21, 2025
తెలంగాణ రైజింగ్ – 2047′ సర్వేకు విశేష స్పందన: కలెక్టర్

తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు రూపకల్పనకై ఉద్దేశించిన “తెలంగాణ రైజింగ్ – 2047” సిటిజన్ సర్వేకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. వారం రోజుల క్రితం ప్రారంభించిన ఈ సర్వేలో వివిధ ప్రాంతాల నుంచి పౌరులు పాల్గొని, విలువైన సమాచారాన్ని అందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సర్వే ఈనెల 25 వరకు కొనసాగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.