News September 15, 2025
తిరుపతి: విదేశీ పండ్ల సాగుపై శిక్షణ

APSSDC ఆధ్వర్యంలో విదేశీ పండ్ల సాగుపై ఆన్‌లైన్ విధానంలో ఉచిత నైపుణ్య శిక్షణ కల్పిస్తున్నట్లు తిరుపతి జిల్లా నైపుణ్య అభివృద్ధి శాఖ అధికారి లోకనాథం పేర్కొన్నారు. సెప్టెంబర్ 20వ తేదీ నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ఆసక్తి కలిగిన యువత, రైతులు QR కోడ్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.
Similar News
News September 15, 2025
వనపర్తి: మహిళలు, పిల్లల ఆరోగ్యానికి ‘స్వస్థ నారీ, సశక్తి పరివార్’: కలెక్టర్

మహిళలు, పిల్లలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించే లక్ష్యంతో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు ‘స్వస్థ నారీ, సశక్తి పరివార్ అభియాన్’ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. మెరుగైన ఆరోగ్య సంరక్షణ సేవలతో మహిళలు, పిల్లల సాధికారత సాధించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. జిల్లాలోని అన్ని పీహెచ్‌సీల పరిధిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు.
News September 15, 2025
విశాఖలో 15 హోటల్స్‌పై క్రిమినల్ కేసులు

గత నెల ఒకటి రెండు తేదీల్లో ఫుడ్ కంట్రోలర్ పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో జరిగిన దాడుల్లో 81 హోటల్స్‌లో శాంపిల్స్ సేకరించి ఫుడ్ ల్యాబరేటరీకి పంపించారు. వీటి ఫలితాలు రావడంతో 15 హోటల్స్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నామని మరో 14 హోటల్స్‌పై జేసి కోర్టులో జరిమానా విధిస్తున్నట్లు అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ కళ్యాణ్ చక్రవర్తి ఓ ప్రకటనలో తెలిపారు. హోటల్స్ యజమానులు ఫుడ్ సేఫ్టీ ప్రకారం నాణ్యత పాటించాలన్నారు.
News September 15, 2025
ఏపీలో ఐఏఎస్‌ల బదిలీలు

రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌లు ట్రాన్స్‌ఫర్ అయ్యారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈవోగా ధాత్రిరెడ్డి, ఫైబర్ నెట్ ఎండీగా గీతాంజలి శర్మ, మౌలిక సౌకర్యాలు, పెట్టుబడుల శాఖ ఎండీగా సౌర్యమాన్ పటేల్‌తో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌గా ఐపీఎస్ రాహుల్ శర్మకు పూర్తి బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.