News April 7, 2025

తిరుపతి: వివిధ పథకాలకు రూ.కోటి విరాళం

image

టీటీడీ నిర్వహిస్తున్న వివిధ పథకాలకు రూ.కోటి విరాళంగా అందింది. ఈ మేరకు ఒడిశాకు చెందిన శివమ్ కాండేవ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.20 లక్షలు, ఎస్వీ గోసంరక్షణ ట్రస్టుకు రూ.20 లక్షలు, స్విమ్స్ ట్రస్టుకు రూ.20 లక్షలు, ఎస్వీ సర్వ శ్రేయాస్ ట్రస్టుకు రూ.10 లక్షలు, ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్ట్‌కు రూ.10 లక్షలు విరాళంగా ఇచ్చింది.

Similar News

News April 7, 2025

విశాఖ: పరీక్షకు విద్యార్థులు లేట్… వివరణ ఇచ్చిన పోలీసులు

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన వల్ల విద్యార్థులు JEE పరీక్షకు హాజరవలేదనే విషయంపై విశాఖ పోలీసులు వివరణ ఇచ్చారు. విద్యార్థులు పరీక్షా కేంద్రంలో 7గంటలకు రిపోర్ట్ చేయాలని, 8:30 గంటలకు గేట్ మూసివేయనున్నట్లు హాల్ టికెట్‌లో ఉందన్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఆ రూట్‌లో 8:41గంటలకు వెళ్లారన్నారు. చినముషివాడలోని పరీక్షా కేంద్రానికి వెళ్లేందుకు గాను సర్వీస్ రోడ్‌లలో 8:30 వరకు ట్రాఫిక్ ఆపలేదని స్పష్టం చేశారు.

News April 7, 2025

MNCL: పదవ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభం

image

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కార్మెల్ కాన్వెంట్ హైస్కూల్ లో సోమవారం పదవ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమైంది. సబ్జెక్టుకు ఒకరు చొప్పున ఏడుగురు అసిస్టెంట్ క్యాంపు ఆఫీసర్స్, 65 మంది చీఫ్ ఎగ్జామినర్స్, 390 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్స్, 130 మంది స్పెషల్ అసిస్టెంట్స్ విధుల్లో చేరగా.. 7,280 పేపర్లు మూల్యాంకనం చేశారు. మూల్యాంకనాన్ని డీఈఓ యాదయ్య పర్యవేక్షించారు.

News April 7, 2025

ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో BJP-MIM

image

TG: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోటీకి నామినేషన్ల పరిశీలన ముగిసింది. ఇద్దరు స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లను ఎలక్షన్ కమిషన్ తిరస్కరించింది. కాంగ్రెస్, BRS పార్టీల నుంచి అభ్యర్థులెవరూ పోటీ చేయట్లేదు. దీంతో భాగ్యనగరంలో BJP-MIM రెండు పార్టీలే తలపడనున్నాయి. ఈ నెల 23న ఎన్నికలు జరగనుండగా. 25న ఓట్ల లెక్కింపు ఉండనుంది.

error: Content is protected !!