News February 12, 2026

తిరుపతి: ‘వ్యభిచారం ఆరోపణలు అవాస్తవం’

image

రెండేళ్లుగా తన కుమార్తెతో బలవంతంగా వ్యభిచారం చేయిస్తూ ఎక్కడో దాచారని రేణిగుంటకు చెందిన ఓ మహిళ ఆరోపించిన వీడియో వైరలైంది. దీనిపై గాజులమండ్యం సీఐ స్పందించారు. ‘రేణిగుంటలోని ఓ కంపెనీలో ఆమె కుమార్తె పనిచేసేది. తన తల్లికి మానసిక సమస్య సరిగా లేక తరచూ కంపెనీకి వెళ్లి గొడవ పడేది. దీంతో కుమార్తె ఇక్కడ జాబ్ మానేసి బెంగళూరుకు వెళ్లి జాబ్ చేసుకుంటోంది. తల్లి ఆరోపణలు నిరాధారం’ అని సీఐ చెప్పారు.

Similar News

News February 15, 2026

పెద్దపల్లి: రేపు తెలంగాణ SF ఎక్స్‌ప్రెస్ రీ షెడ్యూలింగ్

image

రైలు నంబర్ 12723 హైదరాబాద్- న్యూఢిల్లీ తెలంగాణ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రేపు 3 గంటలు ఆలస్యంగా బయలు దేరనున్నట్లు నేడు దక్షిణ మధ్య రైల్వే అధికారులు పేర్కొన్నారు. హైద్రాబాద్‌లో ఉదయం 6 గంటలకు బయలుదేరాల్సిన రైలును 3 గంటలు ఆలస్యంగా రీషెడ్యూల్ చేసిన నేపథ్యంలో ఆదివారం ఉదయం 9 గంటలకు బయలుదేరుతుందని తెలిపారు. కాజీపేట, రామగుండం, మంచిర్యాల తదితర ప్రాంతాల ప్రయాణికులు సమయ పాలన మార్పు గమనించాలని సూచించారు.

News February 15, 2026

నర్సంపేటలో ఢిల్లీ పోలీసుల తనిఖీలు..!

image

వరంగల్ జిల్లా నర్సంపేటలో నకిలీ కంపెనీలు సృష్టించి సుమారు రూ.2.50 కోట్లు మోసం చేసిన కేసులో ఢిల్లీ పోలీసులు ప్రత్యేక బృందం తనిఖీలు చేపట్టింది. వేర్వేరు అడ్రస్‌లతో బ్యాంక్ ఖాతాలు తెరిచి సైబర్ ఫ్రాడ్ చేసినట్లు గుర్తించారు. నిందిత మహిళ ప్రస్తుతం హైదరాబాద్‌లో పబ్ నడుపుతున్నట్లు సమాచారం. ఆమె స్వగ్రామం లక్నేపల్లిలోని ఇంట్లో సోదాలు నిర్వహించారు.

News February 15, 2026

రష్యా ఆయిల్ ఆపేస్తామని ఇండియా హామీ ఇచ్చింది: రుబియో

image

రష్యా నుంచి క్రూడాయిల్ కొనుగోళ్లను ఆపేస్తామని ఇండియా తమకు హామీ ఇచ్చిందని US విదేశాంగ మంత్రి మార్కో రుబియో చెప్పారు. ‘రష్యా చమురుపై మరిన్ని ఆంక్షలు విధించాం. అదనపు రష్యన్ ఆయిల్ కొనుగోళ్లను నిలిపేస్తామని చర్చల సందర్భంగా భారత్ మాటిచ్చింది’ అని మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌లో అన్నారు. ఇండియా తమ ఆయిల్ కొనుగోలు చేయదని ట్రంప్ తప్ప <<19115659>>ఇంకెవరూ చెప్పలేదని<<>> రష్యా విమర్శించడం తెలిసిందే.