News March 31, 2025
తిరుపతి: శ్రీవారి భక్తుడు మృతి

ఈనెల 24న భూదేవి కాంప్లెక్స్‌లోని టాయిలెట్‌లో కాలు జారిపడిన శ్రీవారి భక్తుడిని అధికారులు రూయ ఆసుపత్రిలో చేర్పించారు. రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ భక్తుడు ఆదివారం మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి ఒంగోలుకు చెందిన వీరాంజనేయులుగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని రుయా మార్చురీకి తరలించారు. వీఆర్వో ఫిర్యాదు మేరకు అలిపిరి ఎస్సై అజిత కేసు నమోదు చేశారు.
Similar News
News February 25, 2026
సత్తా చాటిన ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలు

విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో మంగళవారం ప్రజాప్రతినిధుల క్రీడా పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పరుగు పందెంలో ఎమ్మెల్యే గద్దె ప్రథమ స్థానం సాధించగా, ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య ద్వితీయ బహుమతి గెలుచుకున్నారు. వాలీబాల్‌లో ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ప్రొఫెషనల్ ప్లేయర్‌లా అదరగొట్టగా.. కబడ్డిలో ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ప్రత్యర్థులను ఉడుంపట్టుతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
News February 25, 2026
లోకేశ్ బాగా స్పందించారు.. నిర్లక్ష్యంగా అధికారులు: హైకోర్టు

AP: ఎన్టీఆర్(D) ఎ.కొండూరులోని KGBVలో విద్యార్థినులను ఎలుకలు కొరికిన ఘటనపై మంత్రి లోకేశ్ తక్షణమే స్పందించారని హైకోర్టు ప్రశంసించింది. మంత్రి ఇలా పనిచేస్తుంటే కొందరు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్నారని మండిపడింది. KGBVల్లో పీజీటీల సేవలను కొనసాగిస్తామని కోర్టుకు హామీ ఇచ్చి పట్టించుకోకపోవడంపై సర్వశిక్షా అభియాన్ పీడీ శ్రీనివాసరావుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
News February 25, 2026
WGL: 17 మంది వైద్యులపై వేటు

రాష్ట్రంలో విధులకు హాజరుకాక దీర్ఘకాలిక సెలవుల్లో ఉన్న 94 మంది వైద్యులను తొలగిస్తూ DME నరేంద్రకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన 17 మంది ఉన్నారు. కాకతీయ మెడికల్ కాలేజ్, ఎంజీఎం ఆసుపత్రి, జనగామ, మహబూబాబాద్, భూపాలపల్లి ప్రాంతాల్లో పనిచేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయి వైద్యులు సస్పెండ్ అయ్యారు. ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికై విధుల్లో చేరని వారిని తొలగించారు.


