News July 10, 2024
తిరుపతి: సిగరెట్లు అమ్మితే రూ.200 ఫైన్

తిరుపతి జిల్లాలో పాఠశాలలు, కాలేజీల సమీపంలో సిగరెట్లు, బీడీలు అమ్మితే పోలీసులు జరిమానా విధిస్తున్నారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు రేణిగుంట పోలీసులు పలు దుకాణాల్లో సోదాలు చేశారు. కొందరు సిగరెట్, బీడీ అమ్ముతున్నట్లు గుర్తించి వారికి రూ.200 జరిమానా విధించారు. విద్యాసంస్థల వద్ద బీడీ, సిగరెట్ వంటి ధూమపాన వస్తువులు అమ్మితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News February 14, 2026
పుంగనూరు: 6 వేల ఏళ్లనాటి శివలింగం

పుంగనూరులోని నెక్కొంది కొండపై ఉన్న శ్రీఅగస్తీశ్వర స్వామి ఆలయంలో అగస్త్య మహాముని స్వయంగా లింగాన్ని ప్రతిష్ఠించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ ప్రాచీన ఆలయం చోళుల కాలంలో నిర్మించబడి, శైవ సంప్రదాయానికి పేరు పొందింది. ఇక్కడ శివుడు అగస్తీశ్వరునిగా, పార్వతి దేవి మీనాక్షిగా పూజలందుకుంటారు. ఆలయంలోని శివలింగం 6 వేల సంవత్సరాల పురాతమైనదిగా ప్రజల నమ్మకం.
News February 14, 2026
చిత్తూరు: ఈ ఏడాది నీటి ఎద్దడి లేనట్లే.!

కృష్ణా జలాలతో ఈ ఏడాది జిల్లాలో నీటి ఎద్దడి తప్పింది. పుంగనూరు తంబళ్లపల్లె, మదనపల్లె, నియోజకవర్గాలలోని అన్ని చెవులకు, పలమనేరులో కొన్ని చెరువులకు హంద్రి-నీవా ప్రాజెక్ట్ ద్వారా నీటి సరఫరా జరుగుతోంది. తంబళ్లపల్లెలో రెండు, మదనపల్లెలో 4 చెవులకు నీటిని మళ్లించారు. పుంగనూరులో 2, పలమనేరులో కొంత మేర చెరువులకు PBC నుంచి నీటిని తరలిస్తారు. ఎక్కడన్నా నీటి సమస్య వస్తే ఎదుర్కొనుందేకు సిద్ధమని అధికారులు తెలిపారు.
News February 14, 2026
చిత్తూరు: నీరున్నా వృథాగా వాడితే ఇబ్బందులే.!

హంద్రీ-నీవా ద్వారా జిల్లాకు కృష్ణా జలాలు చేరాయి. నీరు ఉంది కదా అని వృథాగా వాడితే భవిష్యతులో ఇబ్బందులు తప్పవని పలువురు వాపోతున్నారు. పుంగనూరు, కుప్పం బ్రాంచ్ కెనాళ్ల ద్వారా జిల్లాకు సరాసరి 4.5TMCల నీరు వస్తోంది. మార్చి ఆఖరు వరకు ఈ నీటి విడుదల కొనసాగనుంది. వర్షాలు, హంద్రీ-నీవా జలాలతో 80% చెరువులు నిండు కుండలా మారాయి. కుప్పంలో 92 చెరువులు పూర్తిగా, 14 పాక్షికంగా, పలమనేరులో మరో 54 చెరువులు నిండాయి.


