News October 24, 2025

తిరుపతి: సుదర్శన చక్రత్తాళ్వారు తీర్థం గురించి తెలుసా..

image

శేషాచల పర్వతలల్లోని అనేక పుణ్యతీర్థాల నుంచి జాలువారి పవిత్ర కపిలతీర్థం సరోవరం (కోనేరు) ఏర్పడింది. దీనినే సుదర్శన చక్రత్తాళ్వారు తీర్థం, ఆళ్వారు తీర్థం అని కూడా పిలుస్తారు. ఈ పుణ్యతీర్థంలో స్నానాలు చేసి తూర్పు వైపు ఉన్న శ్రీ కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం వల్ల సకల పాపాలు తొలిగుతాయని ప్రసిద్ధి.

Similar News

News October 24, 2025

మెదక్: విషాదం.. మృతదేహాల కోసం ఎదురుచూపు..!

image

మెదక్ మండలం <<18091691>>శివ్వాయిపల్లికి చెందిన<<>> మంగ సిద్ధగౌడ్‌కు ఆనంద్ గౌడ్, రమేశ్ గౌడ్ ఇద్దరు కుమారులు, ఒక కూతురు. ఆనంద్ గౌడ్ దుబాయ్‌లో ఉద్యోగరీత్యా స్థిరపడగా అతడికి పాపన్నపేటకు చెందిన సంధ్యారాణితో వివాహమైంది. వీరికి కుమార్తె చందన(23) బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తుంది. కుమారుడు శ్రీవల్లభ గౌడ్ అలహాబాద్‌లో చదువుతున్నాడు. తల్లీకూతుళ్లు కర్నూల్ వద్ద బస్సులో సజీవ దహనం కాగా మృతదేహాల కోసం ఎదురుచూస్తున్నారు.

News October 24, 2025

మెట్పల్లి నుంచి అరుణాచల గిరిప్రదక్షిణకు బస్సు

image

కార్తీక పౌర్ణమి సందర్భంగా నవంబర్ 5న జరగనున్న అరుణాచల గిరి ప్రదక్షిణ కోసం మెట్పల్లి డిపో ఆధ్వర్యంలో ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ బస్సు నవంబర్ 3న మధ్యాహ్నం 2 గంటలకు మెట్పల్లి బస్ స్టేషన్ నుంచి బయలుదేరి మార్గమధ్యంలో కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ దర్శనాల అనంతరం నవంబర్ 4 రాత్రికి అరుణాచలం చేరుతుందని, 5న దర్శనం అనంతరం తిరుగు ప్రయాణం అవుతుందని చెప్పారు.

News October 24, 2025

అమరావతిలో RBI ప్రధాన కార్యాలయ నిర్మాణానికై పూర్తైన ఒప్పందం

image

అమరావతిలోని నేలపాడులో 3 ఎకరాలలో 1.6 లక్షల చదరపు అడుగులలో RBI ప్రాంతీయ కార్యాలయ నిర్మాణానికి ముందడుగు పడింది. రూ.12 కోట్లు చెల్లించిన RBI..భూ కొనుగోలు ఒప్పందాన్ని పూర్తి చేసింది. సంబంధిత పత్రాలను CRDA ల్యాండ్స్ విభాగ అధికారి వి.డేవిడ్ రాజు..RBI అధికారి వీసీ రూపకు శుక్రవారం అందజేశారు. ప్రాంతీయ కార్యాలయ నిర్మాణంతో పాటు అమరావతిలో RBI రూ.200 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు CRDA తెలిపింది.