News November 3, 2025

తిరుపతి: స్కౌట్స్ అడ్వాన్స్ కోర్స్ ప్రారంభం

image

తిరుపతి: తిరుచానూరు జెడ్పి హైస్కూల్ నందు నెల 3 నుంచి 9వ తేదీ వరకు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ తిరుపతి జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో తిరుపతి, చిత్తూరు జిల్లాలోని 30 మంది పీఎంశ్రీ పాఠశాలలలోని స్కౌట్ మాస్టర్లకు అడ్వాన్స్ కోర్సు శిక్షణ ప్రారంభమయ్యింది. DEO కెవీఎన్ కుమార్ ఆదేశాల మేరకు ఈ శిక్షణ జరుగుతుందని జిల్లా ఇంచార్జి కార్యదర్శి జి. విజయ్ కుమార్ తెలిపారు.

Similar News

News November 4, 2025

రబ్బర్ బోర్డ్‌లో 51 పోస్టులకు నోటిఫికేషన్

image

<>రబ్బర్ బోర్డ్‌<<>>లో 51 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 1వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో BSc, MSc, PhD, బీటెక్, BE, ME, ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు గ్రూప్ ఏ పోస్టులకు రూ.1500, గ్రూప్ బీ పోస్టులకు రూ.1000, గ్రూప్ సీ పోస్టులకు రూ.500. SC, ST, PWBDలకు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://recruitments.rubberboard.org.in/

News November 4, 2025

కాకినాడ: జిల్లా అధికారులకు పవన్ కళ్యాణ్ ఆదేశాలు

image

కాశీబుగ్గ తొక్కిసలాట నేపథ్యంలో కాకినాడ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన అన్నవరం, పిఠాపురం, సామర్లకోటలో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలెక్టర్, ఎస్పీలను ఆదేశించారు. సోమవారం ఆయన వారితో ఫోన్‌లో మాట్లాడారు. కాశీబుగ్గ తొక్కిసలాట దృష్ట్యా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆలయాలపై నిరంతరం ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.

News November 4, 2025

నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

image

నేడు కోనసీమ, తూ.గో, ప.గో, కృష్ణా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, ATP, చిత్తూరు, TPT జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్సుందని APSDMA పేర్కొంది. TGలోని ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, HYD, మేడ్చల్, సంగారెడ్డి, రంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని HYD IMD తెలిపింది.