News January 9, 2026

తిరుపతి: స్థానికాలయాల్లో 12లక్షల మంది దర్శనం

image

వైకుంఠ ఏకాదశి సందర్భంగా TTD స్థానికాలయాల్లో 12 లక్షల మంది దర్శనం చేసుకున్నారని TTD ఛైర్మన్ BR నాయుడు పేర్కొన్నారు. కల్యాణ కట్టలో 2.6 లక్షల మంది తలనీలాలు సమర్పించారని అన్నారు. విజయవంతం చేసిన జిల్లా అధికారులు, జిల్లా పోలీసులు, TTD అధికారులు, సిబ్బంది, శ్రీవారి సేవకులు, భక్తులకు దన్యవాదాలు తెలిపారు.

Similar News

News February 19, 2026

మహిళలకు గుడ్‌న్యూస్.. త్వరలో స్మార్ట్ కార్డులు!

image

TG: ఫ్రీ బస్సు ప్రయాణానికి సంబంధించి ప్రతి మహిళకు ‘మహాలక్ష్మి’ స్మార్ట్ కార్డులను ఇచ్చేందుకు RTC సిద్ధమైంది. వచ్చే నెల నుంచి వీటిని జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ చిప్ బేస్డ్ కార్డులను టికెట్ మెషీన్‌పై ట్యాప్ చేస్తే టికెట్ జనరేట్ అవుతుందని అధికారులు తెలిపారు. తొలుత జిల్లాకొక మండలంలో పైలట్ ప్రాజెక్టుగా కార్డులు జారీ చేసి తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తారని సమాచారం.

News February 19, 2026

చిత్తూరు: అక్కడ మధ్యాహ్నం వరకే స్కూల్స్..

image

రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని జిల్లాలోని ప్రభుత్వ ఉర్దూ పాఠశాలల పనివేళల్లో సవరణ చేస్తున్నట్లు డీఈవో రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. జిల్లాలోని అన్ని ఉర్దూ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు మాత్రమే పనిచేస్తాయన్నారు. ఉపాధ్యాయులు రంజాన్ మాసంలో ప్రతి రోజూ సాధారణ సమయం కంటే ఒక గంట ముందుగా ఇంటికి వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతిచ్చిందని ఆయన వెల్లడించారు.

News February 19, 2026

ఇంటర్వ్యూతో IICTలో ఉద్యోగాలు

image

<>HYD<<>>లోని CSIR-IICT 16పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల వారు FEB 24న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. పోస్టును బట్టి PhD, MTech, మెటీరియల్ ఇంజినీరింగ్, బయో టెక్నాలజీ, MSc(కెమిస్ట్రీ, బయో కెమిస్ట్రీ, బయో టెక్నాలజీ, మైక్రో బయాలజీ, ఫుడ్ సైన్స్&న్యూట్రీషన్), BTech/BE, BSc అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. Sr. ప్రాజెక్ట్ అసోసియేట్‌కు గరిష్ఠ వయసు 40 ఏళ్లు కాగా.. మిగతా పోస్టులకు 35ఏళ్లు. సైట్: www.iict.res.in