News April 1, 2026

తిరుపతి స్విమ్స్‌లో అరుదైన ఆపరేషన్లు

image

తిరుపతి స్విమ్స్ యూరాలజీ విభాగం డాక్టర్లు అరుదైన, క్లిష్టమైన మూడు ఆపరేషన్లను విజయవంతంగా చేసినట్లు మెడికల్ సూపరింటెండెంట్ డా.రామ్ తెలిపారు. డా.అనిల్ కుమార్ నేతృత్వంలో కిడ్నీ క్యాన్సర్‌తో పాటు రాళ్లు ఉన్న రోగికి ఎలాంటి అపాయం లేకుండా ప్రత్యేక ఆపరేషన్ చేశారు. చిన్నారి వృషణ క్యాన్సర్ కేసులో టెస్టిస్‌ను రక్షించారు. మదనపల్లెకు చెందిన యువకుడిలో ట్యూబర్‌కులోసిస్ గడ్డను తొలగించారు.

Similar News

News April 13, 2026

కంగ్టి గిరిజన గురుకులంలో 100% ఉత్తీర్ణత

image

కంగ్టిలోని గిరిజన రెసిడెన్షియల్ గురుకుల జూనియర్ కళాశాల ఇంటర్ ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించి రికార్డు సృష్టించింది. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 17 మంది, ద్వితీయ సంవత్సరంలో 20 మంది విద్యార్థులు పరీక్ష రాయగా అందరూ పాస్ అయ్యారని ప్రిన్సిపల్ విజయ్ తెలిపారు. సెకండియర్‌లో బేగరి ఈశ్వర్ 928 మార్కులు సాధించి కళాశాల టాపర్‌గా నిలిచాడు. ఈ అద్భుత ప్రతిభ కనబరిచిన విద్యార్థులను కళాశాల సిబ్బంది అభినందించారు.

News April 13, 2026

హైదరాబాద్: 12 గంటల్లోపే వాటర్ ట్యాంకర్ డెలివరీ

image

ట్యాంకర్ బుకింగ్ చేసిన 12 గంటల్లోపే డెలివరీ చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ఆదేశించారు. మణికొండ, బంజారాహిల్స్, హఫీజ్‌పేట్ ప్రాంతాల్లో డిమాండ్ ఎక్కువగా ఉన్నందున, రాత్రి వేళల్లో కూడా సరఫరా చేయాలన్నారు. అవసరమైతే నైట్ షిఫ్ట్ సిబ్బందికి ప్రత్యేక అలవెన్సులు ఇవ్వాలని జూమ్ సమావేశంలో అధికారులకు MD సూచించారు.

News April 13, 2026

పతనమైన ఉల్లి ధరలు.. రైతుల కన్నీరు

image

కొత్తపల్లి మండల పరిధిలో ఉల్లి రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఉల్లి ధర క్వింటా రూ.300కి పడిపోవడంతో వారి పరిస్థితి దయనీయంగా మారింది. పంట కోతకు పెట్టే ఖర్చులు కూడా తిరిగి రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోసిన ఉల్లిని అమ్మేందుకు మార్కెట్‌లో సరైన ధర లేక పెట్టుబడులు కూడా వృథా అవుతున్నాయని చెబుతున్నారు. ప్రభుత్వం స్పందించి మద్దతు ధరతో కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.