News February 5, 2026

తిరుపతి స్విమ్స్ ఆధ్వర్యంలో క్యాన్సర్ పింక్ బస్సు సేవలు

image

తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ ఏర్పాటైంది. 2 పింక్ బస్సుల ద్వారా గ్రామస్థాయిలో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. అక్కడి నుంచి సేకరించే నమూనాలను స్విమ్స్‌లో పరీక్షలు చేస్తున్నారు. 730 క్యాంపులు నిర్వహించి 42,609 మందికి స్క్రీనింగ్ పరీక్షలు చేసి 3,226 మందిని అనుమానితులుగా గుర్తించారు. ప్రస్తుతం 759 మంది వైద్య చికిత్స పొందుతున్నారు.

Similar News

News February 7, 2026

ధనప్రాప్తి కలగాలంటే ఏం చేయాలంటే?

image

ధనప్రాప్తి కలగడానికి కొన్ని ఆచారాలు పాటించాలి. రోజూ పూజ చేసే సమయంలో ‘శ్రీ సూక్తం’ పఠించాలి. అమ్మవారిని ఉపాసిస్తూ ఓ లవంగాన్ని ఆమె వద్ద ఉంచడం శుభప్రదం. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యం. ప్రతి శనివారం విరిగిన వస్తువులను పారేసి, బూజు దులపాలి. పూజ గదిలో ‘ఏకాక్షి కొబ్బరికాయ’ ఉంచడం వల్ల సంపద పెరుగుతుంది. ఉదయం నిద్రలేవగానే రెండు అరచేతులను చూసుకుని కళ్లకు అద్దుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది.

News February 7, 2026

KMR: మద్యం, మాంసం, మనీ ఎంత ప్రభావం చూపేనో?

image

ఎన్నికలంటే గుర్తొచ్చేది మద్యం, మాంసం, మనీయే. సరిగ్గా మున్సిపల్ ఎన్నికల్లో సైతం కామారెడ్డి జిల్లాలో ఇదే తీరు కనిపొస్తోంది. ఇప్పటికే పలువురు అభ్యర్థులు పొద్దున టిఫిన్లు అందిస్తే, సాయంత్రానికి స్వీట్లు పంచారు. ఎలక్షన్ ప్రచారం ముగింపు దశకు చేరడంతో వచ్చే ఆదివారం మద్యం, మాంసంతో అభ్యర్థులు వార్డు ప్రజలకు దగ్గర కానున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రభావాలు ఎంత ప్రభావం చూపుతుందో చూడాలి.

News February 7, 2026

క్రేజీ టైటిల్‌తో తరుణ్ భాస్కర్ మూవీ

image

ఈ నగరానికి ఏమైంది(ENE) సినిమాతో దర్శకుడు తరుణ్ భాస్కర్‌కు యూత్‌లో ఫుల్ ఫాలోయింగ్ పెరిగింది. తర్వాత ‘కీడా కోలా’ చేసినా అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యారు. దర్శకుడిగా చేస్తూనే నటుడిగానూ ప్రూవ్ చేసుకుంటున్నారు. ‘ENE2’ మూవీ చేస్తున్న తరుణ్ హీరోగా ఓ సినిమాను మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీకి టైటిల్‌ను క్రేజీ డైలాగ్ ‘గాయపడ్డ సింహం’గా ఫిక్స్ చేసినట్లు తెలిపారు. 9న టీజర్ విడుదల కానుందని పేర్కొన్నారు.