News August 23, 2025
తిరుపతి హథీరాంజీ మఠం కూల్చివేతపై వివాదం

తిరుపతి హథీరాంజీ మఠం కూల్చివేతపై వివాదం రేగింది. భవనం శిథిలావస్థలో ఉందని, నివాసయోగ్యం కాదని ఐఐటీ నిపుణులు నివేదిక ఇవ్వగా కలెక్టర్ వెంకటేశ్వర్ నేడు మఠాన్ని పరిశీలించనున్నారు. మఠాన్ని కూల్చొద్దని, వారసత్వ కట్టడంగా కొనసాగించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణకు చెందిన MLC కవిత స్పందిస్తూ.. కూల్చివేత బంజారాల మనోభావాలను దెబ్బతీసేలా ఉందన్నారు. కూల్చివేతపై అధికారులు పునరాలోచించాలని ఆమె కోరారు.
Similar News
News August 23, 2025
కంటిచూపు కోల్పోయిన హోంగార్డుకి సీపీ సాయం

విధి నిర్వహణలో అనారోగ్యానికి గురైన ఓ హోం గార్డుకి కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం అండగా నిలిచారు. కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌లో బ్లూ కోల్ట్స్ విధులు నిర్వహిస్తున్న హోంగార్డు శివకుమార్ హై బీపీ కారణంగా కంటి చూపు కోల్పోయారు. ఆయన వైద్య ఖర్చుల నిమిత్తం రూ.1.5 లక్షల ఆర్థిక సహాయాన్ని సీపీ శుక్రవారం అందించారు. ప్రస్తుతం శివకుమార్‌కు కంటిచూపు వచ్చింది. కాగా, ఆయన నిన్ననే తిరిగి విధుల్లో చేరారు.
News August 23, 2025
రథం గుట్టను పరిశీలించిన జిప్ లైన్ అడ్వెంచర్ బృందం

మణుగూరు గుట్ట మల్లారం వద్ద గల రథం గుట్ట ప్రాంతాన్ని జిప్ లైన్ అడ్వెంచర్ బృందం శుక్రవారం పరిశీలించింది. భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశాల మేరకు ఈ ప్రాంతం పర్యాటక కేంద్రంగా మార్చుటకు పరిశీలనకు వచ్చామని బృందం సభ్యులు తెలియజేశారు. మణుగూరు రథం గుట్టను పరిశీలించిన జిప్ లైన్ అడ్వెంచర్ బృందం పూర్తిస్థాయిలో పరిశీలన చేసి నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని పేర్కొన్నారు.
News August 23, 2025
RR: ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలని రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. శుక్రవారం ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, వైద్యారోగ్యశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వంటి అంశాలపై చర్చించారు. సీజనల్ వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. సోమవారం నుంచి ఫీవర్ సర్వే నిర్వహించాలన్నారు.